• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?

చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?

Published on August 29, 2022 by Bunty Saikiran

Advertisement

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు తక్కువమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజని మనరిజం, స్టార్ డం తో పాటు జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమా అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలోని అలాకుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్. అది చూడగానే జమీందార్ల ఇల్లులా కనిపిస్తుంది. ఇది ట్రావెన్ కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమిందార్ ఇల్లు. అతనిది కూడా ట్రావెన్ కోర్ వంశమే. అలమొట్టిల్ మోదరాజు మహా క్రూరుడు. అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు మరియు ఇతర బంధువులు ఉండేవారు. పైన రాజు ఉండేవారు. బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్ను కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు రాజు. అతని ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఉండేది. ఇక ఇంటికి కాస్త దూరంలో ఉంపుడు గత్తెలను ఒక ప్రత్యేకమైన చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తనకోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు. వారిలో మంచి నాట్యకారులను కూడా పిలిచేవారు. వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతో పాటు సత్కారం కూడా చేసేవాడు. అందాన్ని ఆస్వాదించడంలో ఆ రాజుది అందే వేసిన చేయి. ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడే పుట్టింది. రాజు మంచి పాలనలో ఉన్నప్పుడు తన సోదరి కుటుంబం తన ఇంటికి వచ్చింది.

 

ఇక తన అక్క, బావ వారి పిల్లలను కూడా అదే ఆ స్థానంలో ఉంచుకున్నాడు. ఇక రాజు యొక్క రాజ భోగాలు, సంపదను చూసి అక్క, బావ కుళ్ళుకున్నారు. ఆయన ఆస్తిపై కన్నేశారు. ఆయన ఆస్తులలో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావు. అని రాజు అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు, 1000 ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు. కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక తన అక్క, బావ, పిల్లలు కూడా పెద్దవారయ్యారు. రాజుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే రాజు వయసు మీద పడుతుండడంతో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది. కానీ రాజు తన సంస్థ అధికారులను పిలిపించి తన ఆస్తులు మొత్తాన్ని కొడుకులకు, కూతుళ్లకు రాసిచ్చాడు. దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు. ఎన్నాళ్ళ నుంచో కాచుకుని కూర్చున్న తన అక్కకు ఆస్తి దక్కలేదు. దీంతో రాజును చంపేయాలనుకున్నారు. మొదట రాజు భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు.

Advertisement

ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్నచిన్న ముక్కలుగా చేసి వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆమె కూడా రోజు తాగేది. దీంతో మూడు నెలల తర్వాత మంచాన పడి ఆమె చనిపోయింది. దీంతో రాజు ఒంటరివాడయ్యాడు. తన తోడు ఎవరూ లేకపోవడంతో తన సేవకుడి 18 ఏళ్ల కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది. కానీ ఓ రోజు ఒక కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు. అప్పుడు రాజుతో పాటు తన పనిమనిషి బొమ్మ కూడా వేయమన్నాడు. రాజు. రాజు బొమ్మను రెండు రోజుల్లో వేశాడు. కానీ ఆ పనిమనిషి బొమ్మ వేయడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు. కళాకారుడు తర్వాత ఆ పనిమనిషి బొమ్మను అందంగా తీర్చిదిద్దాడు. ఆ బొమ్మని చూసిన రాజుకు పనిమనిషిపై మనసు పడింది. ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పనిమనిషి పై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది. తన గేమ్ స్టార్ట్ చేసింది. అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది.

అనుకున్న విధంగానే ఒక గదిలో రాజును ఆ పనిమనిషిని చంపేసింది. వారి నగలు, డబ్బులు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది. ఆ తర్వాత రాజును చంపిన గది తప్ప ఆ కోటను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఆ రాజు, కొడుకు కూడా ఒక సేవకున్ని ఆ స్థానంలో ఉంచాడు. ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి క్రూర శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు. తర్వాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి. ఆ సేవకుడు కూడా పారిపోయాడు. చివరికి తన అక్కే ఆ ఇంట్లో ఉంది. మళ్లీ అమావాస్య రానే వచ్చింది. ఆరోజు రాత్రి తన అక్క, కూతురు ఇంట్లో ఉండగానే ఆ పనిమనిషి ఆత్మ తన కూతురును ఆవహించింది. అచ్చం పనిమనిషి లాగా మాట్లాడుతూ, ఆమె కూతురే ఆ రాజు అక్కను చంపేసింది. ఆ విధంగా ఆ కోట నుంచి ప్రతి అమావాస్య రోజున శబ్దాలు రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని చంద్రముఖి సినిమాను తెరకెక్కించారు.

 

Advertisement

Read also: హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది? 

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
  • నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!
  • ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !
  • ఒక జిల్లా కలెక్టర్ అయ్యి..! పెళ్ళికి కట్నం అడిగాడు అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd