• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » రోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా… నో ఆన్స‌ర్‌…!

రోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా… నో ఆన్స‌ర్‌…!

Published on January 12, 2023 by karthik

Advertisement

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు.

ఇది ఇలా ఉండగా, తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న చిరు, పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ, మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాటలపై తాను ఎలాంటి కామెంట్ చేయనని, గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించాలని, తనతో పాటు సెంటిమెంట్ కూడా పంచుకున్నానని అన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు తో పాటు కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం, ఇవన్నీ తన హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానాలు అని, ఆమె అన్న మాటలకు తను ఆన్సర్ ఇస్తే తన స్థాయిని తగ్గించుకున్న వాడిని అవుతానని అన్నారు.

Advertisement

 

ఆమె మంత్రి అయ్యాక కూడా తన ఇంటికి వచ్చారని, అక్కడే భోజనం కూడా చేశారని, ఎప్పుడు సొంత మనుషుల్లా తిరిగారని అన్నారు. వాళ్ళ మెంటాలిటీ, నైజాం ప్రకారం మాట్లాడేస్తే, నేను స్పందించి మాట్లాడడం నా నైజాం కాదని, వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కొంతమందికి నా పేరు వాడకపోతే గుర్తింపు కూడా ఉండదు. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతారు. మళ్ళీ నా దగ్గరికి వస్తారు. మళ్లీ నన్నే అంటారు. నేను ఏ సహాయం చేయలేదు అని మాట్లాడతారు. నేను ఎవరెవరికి సహాయం చేశాను నా మనసుకి తెలుసు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల మెగా ఫ్యామిలీ పై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్స్ తమ సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేదంటూ ఎద్దేవా చేశారు రోజా.

Advertisement

READ ALSO : అదేంటి చిరు అలా అనేసారు? కిరణ్ అబ్బవరం మనసును బాధపెట్టింధిగా !

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd