• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

Published on December 3, 2022 by Bunty Saikiran

Advertisement

టాలీవుడ్‌ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే.

 

READ ALSO : తెలంగాణ గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు.. దరఖాస్తు తేదీల వివరాలివే

చిరంజీవి & రీమేక్‌లు స్వర్గంలో చేసిన మ్యాచ్…అయన రీమేక్ చేస్తున్నాడు అంటే చాలు ఇప్పటికే చూసిన సినిమానే అయినా మళ్లీ చూడాలి అని రెడీ అయిపోతున్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ థియేటర్లలో రన్ అవుతున్న గాడ్ ఫాదర్ సినిమానే. చిరు ఘరానా మొగుడు, పున్నమి నాగు నుంచి గాడ్‌ఫాదర్ వరకు కెరీర్‌లో 30 రీమేక్‌లు చేస్తే అందులో ఒక్కటి రెండు తప్ప మిగతవి అన్నీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్. అయితే.. చిరంజీవి టాలీవుడ్‌ లోని 10 మంది దర్శకులతో సినిమా చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

# త్రివిక్రమ్ శ్రీనివాస్

‘జై చిరంజీవ’ సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు చిరు నోట వింటుంటే భలే ఉంటుంది. ఇప్పటికీ ఆ సినిమాలో కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి చిరు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక.

# సుకుమార్

సుకుమార్ అనగానే ఈ మధ్య ‘పుష్ప’ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. చిరుని ఓ స్టైలిష్ ప్రొఫెసర్ గా పెట్టి, ‘మాస్టర్’ టైపులో ఓ సినిమా చేస్తే అదిరిపోద్ది.

# రాజమౌళి

ఈ కాంబోలో మూవీ చూడాలని యావత్ తెలుగుపేక్షకులు కోరుకుంటున్నారు.

Advertisement

# బోయపాటి శ్రీను

మన ఊర మాస్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిరుకి కూడా ఉంది. కానీ కథ సెట్ అవ్వడం లేదు. కథ ఓకే అయితే మాస్ రచ్చ కాయం.

# అనిల్ రావిపూడి

మాస్ ఎలివేషన్స్ ను అలానే కామెడీని తీర్చిదిద్దడంలో మన అనిల్ అన్న రూటే వేరు. బాలయ్య తర్వాత చిరుతో చేసెయ్ అన్న.

# సందీప్ రెడ్డి వంగా

చిరుతో మంచి ‘గ్యాంగ్స్టర్’ కథ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు సందీప్ సార్.

# హరీష్ శంకర్

ఇప్పటివరకు తమ్ముడినే చూసాం. మరి అన్నయ్య సంగతేంటి హరీష్ బ్రో. పవన్ బిజీగా ఉంటే చిరుతో సినిమా చేసేయి.

# శంకర్

ఈయనతో సినిమా చేయాలని చిరు కలలు కన్నారు. కానీ అవకాశం చరణ్ కు దక్కింది. ఛాన్స్ ఉంటే చిరుతో కూడా శంకర్ ఓ సినిమా చేయాలి.

# పూరి జగన్నాథ్

హిట్, ప్లాప్ వంటి వాటి గురించి ఆలోచించకుండా చిరంజీవి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు. పూరి సినిమాల్లో కథ మొత్తం హీరో క్యారెక్టర్రైజేషన్ తో ముడిపడి ఉంటుంది. అందుకే కొత్త చిరుని చూడొచ్చు అని చిరు అభిమానుల కోరిక. ‘మగధీర’ సినిమాలో చిరంజీవి ఎపిసోడ్ ను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని తెలిపారు.

# వివి వినాయక్

‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్లు! మరి హ్యాట్రిక్ కంప్లీట్ చేయరా? చెయ్యాలి! ఇదే అభిమానుల డిమాండ్.

Advertisement

READ ALSO : Ginna Movie : ఓటీటీలోకి జిన్నా, స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd