Ads
ఇండియన్ జట్టులో ప్రస్తుతం ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. వారిలో ఒకరు కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఇంకొకరు సర్ రవీంద్ర జడేజా. వీరిద్దరూ కాకుండా మూడవ వ్యక్తి లార్డ్ శార్దూల్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అసలు ఇతను టీం లో ఎందుకు అంటూ డైరెక్ట్ గానే నెటిజన్స్ అతడిని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దానికి అతని వైఫల్యమే అసలు కారణం. వచ్చే అరకొర అవకాశాలను కూడా అతను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని క్రికెట్ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు.
ఏడాదికో హాఫ్ సెంచరీ, టెయిలండర్ల వికెట్లు తప్ప అతను పెద్దగా రన్స్ చేసేది కూడా ఏమీ లేదు. ఈ మాత్రం దానికి అతను ఎందుకు జట్టులో అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అతని ఆటతీరుని ట్రోల్ చేస్తూ నెట్ లో రకరకాల మీమ్స్ ను చేస్తున్నారు. అసలు శార్దూల్ మ్యాచ్ ఆడుతున్నాడా? చూస్తున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడిన శార్దూల్ బౌలింగ్ లో ఒక వికెట్ పట్టాడు అలాగే ఒక క్యాచ్ పట్టాడు. ఇదే అతని ఆట తీరు అంటూ నెటిజన్లు జోరుగా ట్రోల్ చేస్తున్నారు.
Advertisement
ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒక వికెట్ తీసిన ఈ ఆల్ రౌండర్ పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్నా సమయం కనీసం ఈ పని కూడా చెయ్యలేదు. ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌల్ వేసిన శార్దూల్ 12 పరుగులిచ్చాడు తప్ప ఒక్క వికెట్ కూడా పట్టలేకపోయాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. అసలు అతనికి క్రీజులోకి వచ్చే అవకాశమే రాలేదని.. ఇంకా అతను జట్టులో ఎందుకు ఉన్నట్లని? క్రికెట్ అభిమానులు ముఖం మీదే అడిగేస్తున్నారు. ప్రస్తుతం ఇతని గురించి నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది.
- మరిన్ని Telugu news మరియు క్రికెట్ మరియు క్రీడా వార్తలు కోసం ఇవి చదవండి !