• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత..రేవంత్ కు డేంజర్ బెల్స్ ?

పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత..రేవంత్ కు డేంజర్ బెల్స్ ?

Published on July 16, 2023 by pravallika reddy

Ads

తెలంగాణ కాంగ్రెస్ లో హైకమాండ్ లెక్కలు మారుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణలో సామాజిక – ప్రాంతీయ సమీకరణాలకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ వరుస తప్పులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా నిర్ణయాలు అన్నీ ఢిల్లీ నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత పెంచింది. కీలకమైన ప్రచార కమిటీ కో-చైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ లోటుపాట్లు తెలియటంతో పాటుగా ఆర్థికంగా కీలకమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి వ్యూహాత్మకంగా పెంచుతున్న ప్రాధాన్యతతో రేవంత్ సమస్యలు సృష్టిస్తున్న వేళచెక్ పెడుతున్నట్లు కనిపిస్తుంది.

Ponguleti Srinivas Reddy : కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే భట్టి పాదయాత్ర : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - 10TV Telugu

‘రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టకూడదు – ఎలాగైనా అధికారంలోకి రావాలి’ ఇదీ కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యం. దీని కోసం నేరుగా పార్టీ వ్యవహారాలను హైకమాండ్ పర్యవేక్షిస్తుంది. వ్యూహాలను రచిస్తుంది. ఎంపిక చేసిన నేతలకు బాధ్యత ఇస్తుంది. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు..నేతల వ్యవహార శైలి పైన నిఘా పెట్టింది. అందులో భాగంగా సమర్ధత కలిగిన నేతలకు ప్రాధాన్యత పెంచుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను టీపీసీసీ ప్రచార కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఆచి తూచి ఎంపిక చేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, ఖమ్మంలో కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. పార్టీ మారిన తర్వాత స్పీడ్ పెంచిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement

 

తెలంగాణలో బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో పలు జిల్లాల్లొ గెలుపు ఓటమలును నిర్దేశించే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ కు పగ్గాలు అప్పగించినా, పార్టీ సీనియర్లతో వ్యవహరించిన తీరు, అవసరానికి మించిన దూకుడు…వివాదాస్పద తీరుతో పార్టీకి ఎన్నికల సమయంలో నష్టంగా మారుతుందని హైకమాండ్ గ్రహించింది. దీంతో, రెడ్డి సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా హైకమాండ్ పొంగులేటిని గుర్తించింది. కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పొంగులేటి వ్యతిరేకులను కూడగట్టటంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ లోని అందరి నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మాయమాటలతో రెండుసార్లు అధికారంలోకి.. ఇక చాలు, కేసీఆర్‌ను ఇంటికి పంపుదాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇప్పుడు కీలక పదవి ద్వారా బీఆర్ఎస్ వ్యతిరేక..కాంగ్రెస్ అనుకూల ప్రచార బాధ్యతలను అప్పగించింది. రాజకీయ వ్యూహాల్లో పొంగులేటికి ఉన్న అనుభవం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. ఢిల్లీ స్థాయిలోనూ పొంగులేటికి వ్యాపార – రాజకీయ పరంగా ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని పొంగులేటి ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అదే నమ్మకం కలిగించారు. అన్ని రకాలుగా బలమైన నేతగా పొంగులేటిని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లి వరకు పొంగులేటికి పెరుగుతున్న ఆదరణ, ప్రాధాన్యత పరోక్షంగా రేవంత్ కు అలర్ట్ టైంగా మారుతోంది. గతంలో టీపీసీసీ చీఫ్ ప్రతీ నిర్ణయంలోనూ కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి టీ కాంగ్రెస్ లో కనిపించటం లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ స్పష్టంగా ఉందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

Related posts:

లవ్ టుడే సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఫోన్లు మార్చుకున్నారు.. కానీ చివరికి ఏమైందంటే..? మొదటిరోజే విపక్షాల ఝలక్ ప్రతిపక్షాలపై మోడీ సీరియస్.. ఆ వెంటనే రాహుల్ కౌంటర్స్ మరో విద్యార్థి బలి.. కాలేజీలా? వేధింపుల నిలయాలా?

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd