Advertisement
shradha walker: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ప్రియుడిని కోరడంతో, ఆ దుర్మార్గుడు ప్రేయసిని 35 పార్ట్స్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన ఆరు నెలలకు వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఆప్తాబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రద్ధ అనే యువతి తో ఆప్తాబ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే శ్రద్ధ తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆ దుర్మార్గుడు శ్రద్ధను 35 పార్ట్స్ గా నరికి దారుణ హత్య#$కు పాల్పడ్డాడు.
Advertisement
అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం శ్రద్ధ వాకర్ ప్రియుడు అఫ్తాబ్ పునావాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనని శారీరకంగా హింసిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు లెటర్ రాసింది. అయితే ఆ లెటర్ ఇప్పుడు వెలుగు చూసింది. శ్రద్ధ వాకర్ రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని వారి స్వగ్రామం వాసాయ్ తిలుంజు పోలీస్ స్టేషన్ అఫ్తాబ్ పై ఫిర్యాదు చేసింది. ఆమెను శారీరకంగా బాగా గాయపరిచిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె రాసిన లెటర్ లో ఆఫ్తాబ్ క్రూరమైన ప్రవర్తన గురించి వారి తల్లిదండ్రులకు తెలుసని చెప్పింది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటున్న విషయం కూడా వారికి తెలుసని చెప్పింది. వారాంతాల్లో వాళ్ళు వచ్చి వారితో గడిపి వెళ్తారంటూ వెల్లడించింది. అయితే ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత ఆఫ్తాబ్ తల్లిదండ్రులే శ్రద్ధతో మాట్లాడి, అతను మళ్ళీ అలా ప్రవర్తించడని హామీ ఇచ్చారట.
Advertisement
తర్వాత ఆమె పోలీసులను కలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకుందట. అతని తల్లిదండ్రుల హామీతోనే అప్పుడు శ్రద్ధ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020 నవంబర్ లో ఆఫ్తాబ్ కొట్టిన తర్వాత ఇంటర్వల్ ఇంజురీస్ తో శ్రద్ధ ఆసుపత్రిలో చేరిందట. ఆఫ్తాబ్ కొట్టిన తర్వాత ఆమె కొలీగ్ కరణ్ కు వాట్సాప్ లో ఈ విషయం వెల్లడించింది. అలాగే గాయాలతో ఉన్న ఆమె ఫోటోని కూడా షేర్ చేసింది. ఆ లెటర్ లో “ఈరోజు నాకు ఊపిరాడకుండా చేసి హత్య చేయాలని చూశాడు. నన్ను చంపి ముక్కలుగా నరికేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నన్ను చంపుతానని బెదిరిస్తున్న కూడా పోలీసులను ఆశ్రయించే ధైర్యం లేక అతని వేధింపులు భరిస్తున్నాను. నాకు అతనితో కలిసి ఉండాలని లేదు. అతను నన్ను శారీరకంగా హింసిస్తున్నాడు. నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు” అంటూ రెండేళ్ల క్రితమే శ్రద్ధ లెటర్ లో రాసుకోచ్చింది. అయితే.. ఈ లెటర్ ను ఆధారం చేసుకుని కూడా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!