Advertisement
ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్ ని మొదలు పెట్టడం జరిగింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాలలో అన్న క్యాంటీన్స్ మొదలయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తొలి రోజు అన్న క్యాంటీన్లలో మూడు పూట్ల కలిసి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు.
Advertisement
అల్పాహారం 32,500 మధ్యాహ్నం భోజనం 37,500 రాత్రి భోజనం 23,000 మంది చేసినట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం మంది ప్రజలు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయంలో అన్న క్యాంటీన్ దగ్గర కనిపించారు, రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చేతుల మీదగా ఆహారాన్ని సరఫరా చేశారు.
Advertisement
Also read:
Also read:
రోజూ సగటున 1.05 లక్షల ప్లేట్ల ఆహారం పై రాష్ట్ర ప్రభుత్వం 78.75 లక్షలు రాయితీ ఇస్తోంది. అంటే నెలకు 19.68 కోట్లు ఏడాదికి 236.25 కోట్లు సబ్సిడీ గా ప్రభుత్వం భరిస్తోంది ఏపీలో పేదవాడి ఆకలి తీర్చడానికి 2018 జూలైలో అన్న క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!