Advertisement
చాలామంది నచ్చిన వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలని.. జీవితాంతం హాయిగా ఉండాలని కోరుకుంటుంటారు. కానీ అందరికీ అంత అదృష్టం ఉండదు. కొంతమంది ఇష్టపడి ఒకరినొకరు ప్రేమించుకుని తర్వాత ఏవేవో కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా లవర్ దగ్గర ఈ విషయాలను మాట్లాడకూడదు. ఈ విషయాలను కనుక మాట్లాడినట్లయితే, లేనిపోని గొడవలు వస్తాయి అని గుర్తు పెట్టుకోండి. ఈసారి ఈ తప్పులు మీ లవర్ దగ్గర చేయకుండా చూసుకోండి. లేదంటే అనవసరంగా మీరు కూడా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు.
Advertisement
ఎప్పుడూ కూడా ప్రేయసి తో కానీ ప్రియుడుతో కానీ గత సంబంధాల గురించి మాట్లాడకూడదు. ఇవి వాళ్ళకి నచ్చకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు అసూయ, అభద్రత వంటివి కలుగుతాయి. ఇటువంటివి రహస్యంగా ఉంచడమే మంచిది. అలానే ఆర్థిక సమస్యల గురించి కూడా చెప్పకూడదు. డబ్బు ఒత్తిడికి మూలం. ఎక్కువసార్లు ఆర్థిక సమస్యల గురించి మాట్లాడటం మంచిది కాదు. ఇది వాళ్ళకి చికాకు తీసుకువస్తుంది.
Advertisement
అలానే కుటుంబ కలహాలు గురించి కూడా చెప్పకూడదు. ప్రేమించాక పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలో మీ ఇద్దరి జీవితం కూడా గొడవలతో ఉంటారేమో అని అనుమానం వాళ్లకి రావచ్చు. సో ఎప్పుడూ కుటుంబ కలహాల గురించి చెప్పద్దు. అలానే వివాదాస్పద అంశాల గురించి చెప్పద్దు. మతం రాజకీయాలు లేదంటే వివాదాస్పద అంశాల జోలికి అసలు వెళ్ళకండి. అలానే మీ లవర్ ని ఇతరులతో పోల్చడం కూడా మంచిది కాదు. చాలామంది ఈ పొరపాటు చేస్తుంటారు. అలానే మీ ప్రియుడు లేదా ప్రేయసి స్నేహితులను కూడా తిట్టకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా రిలేషన్షిప్ లో గొడవలు వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!