Advertisement
చలికాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమల వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఎఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. చలికాలంలో దోమల వలన ఇబ్బంది పడుతున్నారా..? ఈ సమస్య నుంచి బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఇవి చక్కగా పని చేస్తాయి. వీటిని ఫాలో అయ్యారంటే దోమల బాధ ఉండదు. చలికాలంలో దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే యూకలిప్టస్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. అందులో కొంచెం నీళ్లు మిక్స్ చేయాలి ఆ తర్వాత ఆ నీటిని ఇంటిని క్లీన్ చేయడానికి ఉపయోగించండి. ఇక దోమలు అసలు రావు.
Advertisement
అలాగే బయట తిరిగి వచ్చాక తప్పకుండా తలస్నానం చేయండి. లేకపోతే చెమట బాగా పడుతుంది. చెమట బాగా పడితే దోమలు కూడా బాగా కుడతాయి. వీలైతే స్నానం చేయండి. అలాగే యూక్లిప్టస్ డ్రాప్స్ ని కొంచెం స్నానం చేసే నీళ్లలో మిక్స్ చేయండి. ఇలా ఈ నీటితో స్నానం చేస్తే కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి.
Advertisement
Also read:
దోమలు కుట్టకుండా ఉండడానికి ఒక గ్లాస్ నీళ్లలో వెల్లుల్లి వేసి మరిగించాలి. దోమలు కుట్టకుండా ఉండాలంటే ఫుల్లుగా దుస్తులు వేసుకోవాలి. పొడవాటి స్లీవ్స్ ఉండే దుస్తులను ప్రిఫర్ చేయండి. నిమ్మరసం చర్మానికి అప్లై చేస్తే కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. ఆ ఘాటుకి దోమలు రావు. డార్క్ కలర్ బట్టలు వేసుకుంటే దోమలు త్వరగా రావు. కాబట్టి ఇలా ఈ చిట్కాలు ఫాలో అయినట్లయితే దోమల వలన ఇబ్బంది ఉండదు.