• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

Published on September 21, 2022 by mohan babu

Advertisement

అనాది కాలం నుంచి గోరింటాకు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమైపోయింది. అన్ని శుభకార్యాల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. స్త్రీలు గోరింటాకును తమ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. గోరింటాకు లో చర్మానికి మేలు చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి.

ఆ రసాయనాలు మన శరీరానికి చల్ లదనాన్ని ఇవ్వడమే కాక అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. గోరింటాకు వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. గోరింటాకు లో ఉండే లాసోన్ అనే సహజసిద్ధమైన రసాయనం వల్ల దీన్ని పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండుతుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న నీటిని మన శరీరం గ్రహించి ఆవిరి చేస్తుంది. దానితో గోరింటాకు ఎండి కాసేపటికి మన శరీరంలోని పొరల్లోకి చొచ్చుకు వెళ్లి ఎర్రగా మారుతుంది.

Advertisement

ఇక ఆషాడమాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే.. ఆషాడం వర్షాకాలం కాస్త ఊపందుకోగానే వస్తుంది. ఈ సమయంలో మన కాళ్లు చేతులు వర్షపునీటిలో నాని చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు దరిచేరకుండా గోరింటాకు అడ్డుకుంటుంది. అలాగే వేసవి కాలంలో ఎండ వేడిమిని గ్రహించిన శరీరం వర్షాకాలంలో ఒక్కసారిగా చల్లబడి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మన ఒంటి లోని ఉష్ణాన్ని గ్రహించి వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది.

Related posts:

మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా..? కరెన్సీ నోట్లపై ఈ గీతాలను మీరు ఎప్పుడైనా గమనించారా.. లేదంటే మీరు నష్టపోయినట్టే..!! గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..? ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?

Latest Posts

  • ఏపీ సీఎం జగన్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!
  • కన్న తండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలినా వినని కూతురు.. ఇక చివరికీ..!
  • వడ్డే నవీన్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి..చివరికి ఏం చేశాడో తెలుసా ?
  • ఫోన్ చూస్తూ లెక్చరర్ కి దొరికిన విద్యార్థిని.. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే ?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd