• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన ఈ సెన్సేషనల్ రికార్డు ఏంటో తెలుసా..?

నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన ఈ సెన్సేషనల్ రికార్డు ఏంటో తెలుసా..?

Published on March 18, 2023 by karthik

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీ సొంతం. దశాబ్దాలుగా ఆ కుటుంబం టాలీవుడ్ లో తన ప్రభావం చూపిస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి, అలాగే వారితో మంచి సంబంధాలు ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ వంశం నుంచి మూడవ తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు.

Read also: డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

త్వరలోనే మరికొందరు హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ తరం స్టార్ హీరోలలోనే ఎవరికి సాధ్యం కానీ అరుదైన రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడున్న హీరోలలో మనం డ్యూయల్ రోల్ చేసిన హీరోలను ఎంతోమందిని చూశాం. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఈ తరం హీరోలలో ఏ హీరో చేయని విధంగా ఏకంగా మూడేసి పాత్రలలో నటించారు. కె.ఎస్ రవీంంద్ర (బాబీ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2017 సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన చిత్రం జై లవకుశ.

Read also: బాలయ్య బాబు “అఖండ” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

Advertisement

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేశారు. జై, లవ, కుశ పాత్రల్లో నటించి వీరవిహారం చేసేసాడు. ఈ చిత్రం కేవలం ఎన్టీఆర్ నట విశ్వరూపం వల్ల హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం అమీగోస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కూడా త్రిపాత్రాభినయం చేశారు.

ఇక ఇదే నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఎన్నో సినిమాలలో రెండు, మూడు, నాలుగు పాత్రాలలో నటించి మెప్పించారు. 1966 లో వచ్చిన నవరాత్రి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా తొమ్మిది పాత్రలు వేశాడు. అయితే ఈ తరం హీరోలలో మాత్రం ఎవరు ట్రిపుల్ రోల్స్ చేయలేదు. నందమూరి కుటుంబం నుంచే ముగ్గురు హీరోలు మూడు పాత్రలలో నటించి అరుదైన రికార్డ్ సెట్ చేశారు.

Advertisement

Read also: దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd