• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » బాలాపూర్ లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బుని ఉత్సవ సమితి ఎం చేస్తుందో తెలుసా?

బాలాపూర్ లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బుని ఉత్సవ సమితి ఎం చేస్తుందో తెలుసా?

Published on September 9, 2022 by Bunty Saikiran

Advertisement

బాలాపూర్ లడ్డు ప్రతి ఏటా రికార్డ్ ధర పలుకుతోంది. అసలు ఇంత రికార్డు ధర పలికే ఈ లడ్డు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డువేలం పాట 1994లో రూ. 450 తో ప్రారంభమైంది. ఈ లడ్డును పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. నమ్మకమే కాదు దీనిని వేలంలో దక్కించుకున్న వారు అనుభవ పూర్వకంగా చెప్పిన మాటలు. లడ్డు వేలం పాట మొదలైన 17 సంవత్సరాలు స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు అవకాశం ఇస్తున్నారు. కోట్లాదిమందికి సెంటిమెంట్ గా ఉన్న లడ్డును దక్కించుకునేందుకు ప్రతి సంవత్సరం పోటీ గట్టిగానే జరుగుతుంది. బాలాపూర్ లడ్డూని ఒక్కసారైనా దక్కించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది సరికొత్త ధరలతో రికార్డుల మోత మోగిస్తూనే ఉంటుంది బాలాపూర్ లడ్డు.

బాలాపూర్ ముఖ్య కూడలి బొడ్రాయి వద్ద గణేశుడు లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈసారి గణేషుడు లడ్డు వేలంపాటలో తొమ్మిది మంది పోటీలో పాల్గొన్నారు. లడ్డు కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీపడ్డారు. కాగా ఈసారి బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రతి ఏటా బాలాపూర్ గణేశుడి లడ్డు రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. ఈసారి రూ. 24.60 లక్షలకు పలికింది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుడికే లడ్డు దక్కింది. వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాదికంటే బాలాపూర్ లడ్డు రూ. 5.70 లక్షలు ఎక్కువగా పలికింది. 2021 లో బాలాపూర్ గణేష్ లడ్డు రూ. 18.90 లక్షలు పలికింది.

Advertisement

#మంచి పనికి బాలాపూర్ లడ్డు నిధులు

ఇక్కడ మరో విషయం ఏమంటే బాలాపూర్ లడ్డు ద్వారా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంతమంది కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. స్థానికులే కాదు స్థానికేతరులు కూడా ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.

 

#బాలాపూర్‌ లడ్డూ వేలం పాట వివరాలు

Advertisement

1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450
1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500
1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000
1997లో కొలను కృష్ణారెడ్డి… రూ. 28,000
1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000
1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ. 65,000
2000లో కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000
2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000
2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000
2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000
2004లో కొలను మోహన్‌రెడ్డి…రూ. 2,01,000
2005లో ఇబ్రహీం శేఖర్‌… రూ.2,80,000
2006లో చిగిరింత శేఖర్‌రెడ్డి..రూ.3,00,000
2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000
2008లో కొలను మోహన్‌రెడ్డి… రూ.5,07,000
2009లో సరిత రూ.5,15,000
2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,25,000
2011లో కొలను బ్రదర్స్‌… రూ. 5,45,000
2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి… రూ.7,50,000
2013లో తీగల కృష్ణారెడ్డి… రూ.9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి…రూ.9,50,000
2015లో కొలను మదన్‌ మోహన్‌రెడ్డి… రూ.10,32,000
2016లో స్కైలాబ్‌రెడ్డి… రూ.14,65,000
2017లో నాగం తిరుపతిరెడ్డి… రూ.15,60,000
2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000
2019లో కొలను రామిరెడ్డి… రూ.17,60,000
2020 కరోనా వల్ల వేలం పాట పాడలేదు.–
2021లో మర్రి శశాంక్‌రెడ్డి,ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్… రూ. 18,90,000
2022లో వంగేటి లక్ష్మారెడ్డి.. రూ. 24.60 లక్షలకు పలికింది.

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd