• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » తారకరత్న ప్రాణాలు కాపాడడానికి తెరవెనుక శ్రమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

తారకరత్న ప్రాణాలు కాపాడడానికి తెరవెనుక శ్రమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

Published on February 6, 2023 by anji

Advertisement

జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాబాయ్ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయనతోపాటు తారకరత్న భార్య అలేఖ్య, తారకరత్న కుమార్తె కూడా అక్కడే ఉన్నారు.

Advertisement

Read also:  డబుల్ సెంచరీ సాధించిన ఈ ఆటగాళ్లలో ఉన్నా కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ?

నందమూరి అభిమానులు, పార్టీ వర్గాల వారు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడుతో సహా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి సుహాసిని, దగ్గుపాటి పురందేశ్వరి, బాలయ్యకి ఆప్తుడు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మంచు మనోజ్ తదితరులు ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న ప్రాణాలు కాపాడడానికి బాలకృష్ణ, చంద్రబాబు చేస్తున్న కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ.. చాలామందికి తెలియని వ్యక్తి తెర వెనుక హీరో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర అని వారంతా అంటున్నారు.

Advertisement

చంద్రబాబు నాయుడు కర్ణాటక సీఎం బసవరాజు తో మాట్లాడి బెంగళూరు వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటి నుంచి మొదలు తారకరత్నను బెంగళూరుకు తీసుకువచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతి ఒక్కటి సుధాకర్ దగ్గర ఉండి సిద్ధం చేశారని అంటున్నారు. తారకరత్నను దగ్గర ఉండి చూసుకునేందుకు సుధాకర్ ఆయన అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారట. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, శివరాజ్ కుమార్ లతోపాటు ఆసుపత్రికి వెళ్లారు సుధాకర్. అంతేకాదు వీళ్లను రిసీవ్ చేసుకోవడానికి సుధాకర్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కి కూడా వెళ్లారు. తెరవెనక ఉండి ఇంత శ్రమించిన ఆరోగ్య శాఖ మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం మంత్రిగారు అంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టులను నందమూరి అభిమానులు షేర్ చేస్తున్నారు.

Read also:  కృష్ణ వీలునామాలో కీలక విషయాలు.. ఆస్తులు మొత్తం వాళ్ళకే..?

Related posts:

అసలు కమల్ హాసన్ కు ఏమైంది? కైకాలను కత్తితో పొడిచిన ఎన్టీఆర్.. కారణమేంటి..? డిప్యూటీ సీఎం భార్య స్టెప్పులు చూశారా..? వీరసింహానికి అలా.. వీరయ్యకు ఇలా..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd