Advertisement
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పంత్. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ సమీపంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకి తీవ్ర గాయం అయింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత మంటల్లో కాలిపోతున్న కారులోంచి ప్రాణాలకు తెగించి పంత్ ని కాపాడింది ఒక డ్రైవర్. డ్రైవర్ ముందుగా బస్సును ఆపి రిషబ్ పంత్ ను కారులోంచి బయటకు తీశాడు.
Advertisement
ఆ సమయంలో తాను హరిద్వార్ వైపు నుంచి వస్తున్నట్లు బస్సు డ్రైవర్ సుశీల్ తెలిపాడు. పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ వైపు నుంచి వస్తుందని తెలిపాడు. ఆ కారు డివైడర్ ని ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లింది అని తెలిపారు. అది చూసిన వెంటనే తాను బస్సును పక్కన ఆపి ప్రమాదం జరిగిన కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లానని.. అప్పటికే కారు బోల్తా కొట్టి ఉందని చెప్పుకొచ్చాడు. “అప్పటికే పంత్ కారు విండో నుంచి సగం బయటకు వచ్చాడు. తాను ఒక క్రికెటర్ అని చెప్పాడు. నేను క్రికెట్ చూడను. అందుకే అతడిని గుర్తుపట్టలేకపోయా. అతని తల్లికి ఫోన్ చేయమని కోరాడు.
అతనిపై వెంటనే దుప్పటి కప్పి కారు నుంచి దూరంగా తీసుకువెళ్లాను. ఆ తర్వాత అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించా. అతడి నీలం రంగు బ్యాగులో 7000 నగదును గుర్తించాము. వాటిని అంబులెన్స్ లో అతడికి అప్పగించాం” అని చెప్పాడు డ్రైవర్ సుశీల్. రిషబ్ పంత్ ని ఆసుపత్రికి తీసుకువచ్చిన డ్రైవర్, కండక్టర్లను హర్యానా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ శుక్రవారం సన్మానించింది. వారిద్దరికీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ. 5 వేల నజరానా అందించారు. డ్రైవర్ కండక్టర్ ఇద్దరు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.
Advertisement
Read also: ‘కాంతార’ సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?