Advertisement
మనం ప్రతిరోజు ట్రైన్ ఎక్కుతూ, దిగుతూ ఉంటాం. కానీ అందులో ఉండే కొన్ని విషయాలను అస్సలు గమనించం. అయితే డీజిల్ తో నడిచే ట్రైన్ ఇంజన్స్ ను స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఆ రైలు ఆగే వరకు అలా ఆన్ చేసే ఎందుకు ఉంచుతారు. మరి అలా ఆన్ చేసి ఉంచితే డీజిల్ భారం ఎక్కువ అవుతుంది కదా దాన్ని ఎందుకు ఆఫ్ చేయరు.. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఏంటో ఒకసారి చూడండి..?
Advertisement
సాధారణంగా ట్రైన్ ఆగాలంటే బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎయిర్ బేస్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. ప్రతి ఒక్క భోగి కింద ఉండే సిలిండర్ లో ఎయిర్ ప్రెజర్ అనేది మినిమం మెయింటెన్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెజర్ మెయింటెన్ చేసే వ్యవస్థ ఇంజన్ లో నుంచి అన్ని బోగీలకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంజన్ లో ఈ వ్యవస్థ పని చేయకపోతే సిలిండర్ లో ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ట్రైన్ స్టేషన్ లో ఆగినప్పుడు కిందనుంచి ” ఉస్ అంటూ గాలి శబ్దం వినిపిస్తుంది ” దీన్ని మీరు గమనించారా.. దీని ద్వారానే ట్రైన్ మొత్తం ఎయిర్ ప్రెజర్ ద్వారా పని చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.
Advertisement
ట్రైన్ ఒకవేళ ఆఫ్ చేస్తే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మళ్లీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది బ్రేకింగ్ సిస్టమ్ పై ప్రభావం చూపుతుంది. ఈ కారణం వల్ల లోకో పైలట్ ట్రైన్ ఇంజన్ ఆఫ్ చేయరు. ట్రైన్ బయలుదేరే ముందు కూడా ప్రెజర్ ఉందో లేదో లోకో పైలట్ చూసుకునే వెళతారు. మరొక రీజన్ ఏంటంటే ట్రైన్ డీజిల్ ఇంజన్ ఎక్కువ సేపు ఆపి ఉంచితే ఆ మిషన్ మొత్తం చల్లబడిపోతుంది. మళ్లీ దాన్ని రీస్టార్ట్ చేయడం చాలా కష్టం. ఒక్కో ట్రైన్ డీజిల్ ఇంజన్ దాని కెపాసిటీని బట్టి 10 నుంచి 20 నిమిషాల వరకు పట్టవచ్చు. అందుకే లోకో పైలెట్ లు ట్రైన్ జర్నీ లో ట్రైన్ ఆఫ్ చేయరు.
ALSO READ: స్టార్ కమెడియన్ డెలివరీ బాయ్ గా మారాడు.. కారణం తెలిస్తే..?