Ads
ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు ఆయన్ను లైట్ తీసుకున్నట్లు పైకి చెబుతున్నా.. ఈ సారి నష్టం తప్పదని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు. సంక్షేమం పేరుతో ఓవైపు విచ్చలవిడిగా అప్పులు చేసి.. అదే అబివృద్ధి అనుకుంటే రానున్న రోజుల్లో తిప్పలు తప్పవనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇటు పవన్ కూడా ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రచార వాహనం వారాహి ని పరిచయం చేశారు. అయితే.. ఈ వెహికల్ హాట్ టాపిక్ గా మారింది. మిలటరీ ట్యాంక్ ను పోలి ఉన్న ఈ వాహనం విషయంలో అధికార వైసీపీ పవన్ ను టార్గెట్ చేస్తోంది. అయినప్పటికీ.. నిన్న ఈ వాహనం రిజిస్ట్రేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదంతా పక్కకు పెడితే, అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి. ఎందుకు పవన్ కళ్యాణ్ తన వాహనానికి పేరు పెట్టాడు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. పవన్ ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం చేయించిన వాహనం పేరు వారాహి.
Advertisement
ఈ పేరు వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పురాణాల గురించి తెలిసిన వారికి విష్ణుమూర్తి వరాహ అవతారం గురించి తెలిసే ఉంటుంది. విష్ణువు దశావతారాలు వరాహ అవతారం ఒకటి. హిరానాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి, భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి, హీరానాక్షుడిని సంహరించి, వేదాలను కాపాడి, భూమిని ఉద్ధరిస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రతానికి ఈ పేరు పెట్టడం వెనుక బలమైన కారణం ఉంది అంటున్నారు జనసేన నేతలు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను చైతన్యపరిచి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి, ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవాలని ఉద్దేశంతో పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాడు. కనుక దాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టారు అంటున్నారు జనసైనికులు.
Read Also : తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే