• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Published on January 8, 2023 by karthik

Advertisement

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ ది ఓ ప్రత్యేక శైలి. ఇండస్ట్రీలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందనేది కూడా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెంకటేష్. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందించారు. అలా ఆయన కెరీర్లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటి నువ్వు నాకు నచ్చావ్. కే విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ – ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Read also: PAWAN KALYAN MOVIES: పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ !

ఈ చిత్రానికి స్రవంతి రవి కిషోర్, స్రవంతి మూవీస్ పతాకంపై.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో నిర్మించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో షూటింగ్ స్పాట్ లో సరదాగా పిల్లలతో కబుర్లు చెబుతున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోగా దూసుకుపోతున్న యాక్టర్, స్టార్ రైటర్ కం డైరెక్టర్ కూడా ఉండడం విశేషం. అవును.. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్న బ్లాక్ టీ షర్ట్ టీనేజ్ కుర్రాడు ఎవరో తెలుసా..? ఎవరో కాదండి మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

Advertisement

అలాగే క్యాప్ పెట్టుకున్న వ్యక్తి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ వర్కింగ్ స్టిల్ ఫోటో నువ్వు నాకు నచ్చావ్ సినిమా అప్పటిది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సురేష్ బాబు తో పాటు రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోర్ కూడా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు రామ్ పోతినేని కజిన్స్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. ఈ అరుదైన ఫోటోని చూసిన నేటిజెన్లు టీనేజ్ లో రామ్ బలే క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Read also: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేక నష్టాలని మిగిల్చిన సినిమాలు !

Latest Posts

  • డీజీపీ ఆఫీస్ ముట్టడించిన వారికి షాక్..!
  • క్రిటికల్ గానే తారకరత్న పరిస్థితి.. మెలేనాతో సతమతం.. ఏంటీ వ్యాధి?
  • వివేకా హత్యకేసు.. సీబీఐ దూకుడుతో మిస్టరీ వీడేనా?
  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd