• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Bramham Gaari Charitra: బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది, మేక లాగా పుట్టిన కుక్కపిల్ల!

Bramham Gaari Charitra: బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది, మేక లాగా పుట్టిన కుక్కపిల్ల!

Published on November 6, 2022 by Bunty Saikiran

Advertisement

Bramham Gaari Charitra: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలని చెప్పారు. ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందులో ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకు రావడం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా చాలా జరిగాయి.

ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ‘శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ అనే సినిమా ద్వారా చాలా విషయాలు వెలుగు చూశాయి. అందులో ప్రపంచ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వివరించి ఉంటుంది. కొంతమంది కుహనా మేధావులు ఆ విషయాలను కొట్టి పారేస్తున్న, అటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉండటం మనం గమనించవచ్చు. తాజాగా బీహార్ గోపాల్గంజ్ జిల్లాలోని సింద్ వలియా ప్రాంతంలోని తెగ్రహీ గ్రామంలో జరిగిన ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యేలాగా చేస్తోంది. అక్కడ ఓ వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది.

Advertisement

అయితే ఇందులో వింత ఏమిటంటే ఆ పిల్లల్లో ఓ కుక్క పిల్ల చూడటానికి వింతగా ఉంది. అచ్చం మేక పోలికలు కలిగి ఉండి, మేక పిల్లలాగే కనబడే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాన్ని మేక పిల్లగా భావించిన శంభుదాస్ అనే వ్యక్తి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అది మేక కాదని తెలిసి బిత్తరపోయాడు. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ బుజ్జి కుక్కపిల్లలు చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సదరు మేక పిల్లని, కాదు కాదు కుక్క పిల్లను తీసుకెళ్లిన ఆ వ్యక్తి మొదట చుట్టుపక్కల అందరిని ఆ మేకపిల్ల తప్పిపోయింది. ఎవరిదని అడగగా, ఎవరు సమాధానం చెప్పలేదట. ఈ క్రమంలో గమ్మత్తైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొంత సమయానికి ఓ కుక్క వచ్చి, బుట్టలో దాచిన కుక్క పిల్లను నోటితో పట్టుకొని ఎత్తుకుపోయిందట. దీంతో అసలు విషయం తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారట.

ఇవి కూడా చదవండి : టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా !

बिहारमधील श्वानाने बकरीसारख्या दिसणाऱ्या पिल्लाला दिला जन्म. pic.twitter.com/1zkRiR4liu

— News18Lokmat (@News18lokmat) November 3, 2022

Advertisement

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd