• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » డేంజర్ లో భారత్.. కేంద్రం అలర్ట్..!

డేంజర్ లో భారత్.. కేంద్రం అలర్ట్..!

Published on January 3, 2023 by sasira

Advertisement

కరోనా మహమ్మారి ఎంతకీ తగ్గనంటోంది. కొత్త రూపాల్లో ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే చైనాలో వెలుగు చూసిన కొత్త సబ్-వేరియంట్ బీఎఫ్.7 భయాందోళనకు గురి చేస్తోంది. చైనాతోపాటు ఇతర దేశాలలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. డ్రాగన్ దేశంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటు భారత్ లోనూ ఈ వేరయంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్టుల్లో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరో సబ్ వేరియంట్ వణుకు పుట్టిస్తోంది.

అమెరికాలో ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ అలజడి మొదలైంది. ఇది బీక్యూ.1 కంటే 120 శాతం వేగంగా వ్యాపిస్తోంది. అక్కడ 40 శాతం కంటే ఎక్కువ కేసులు ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ వే అని నిపుణులు తెలిపారు. దీంతో వ్యాధి సోకిన వారిని ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ఇటు భారత్ లోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. అటు ఇంగ్లాండ్‌ లో కూడా ఈ రకం కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

దేళంలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్‌) వెల్లడించింది. గుజరాత్ ​లో మూడు, కర్ణాటక, రాజస్థాన్​లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వివరించారు అధికారులు. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. బీఏ.2 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ నుంచి ఎక్స్ ​బీబీ ఉద్భవించినట్టు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఎక్స్ ​బీబీ సబ్‌ వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

ఇతర దేశాలతో పోలిస్తే ఎక్స్ ​బీబీ 1.5 ఉపరకం ప్రభావం భారత్ పై అంతగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. దేశంలో అధిక శాతానికిపైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందింది. ఎక్స్ ​బీబీ, ఎక్స్​ బీబీ 1.5 సబ్‌ వేరియంట్లను మొదట భారత్‌ లోనే గుర్తించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని సర్ ​గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చాలాచోట్ల ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు.

Latest Posts

  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!
  • ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd