Ads
Chiranjeevi Godfather OTT Release :మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’. దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మలయాళం మూవీ ‘లూసీ ఫర్’ కు రీమేక్ చేశారు. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. దసరా కానుకగా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అనుకున్నంత రేంజ్ లో రాబట్టలేకపోయింది. అంతకు ముందు చిరు సినిమాలతో పోలిస్తే అత్యంత తక్కువ వసూళ్లను సాధించింది.

Chiranjeevi Godfather OTT Release
గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన అందుకు తగ్గట్టు వసూళ్లను సాధించలేకపోయింది. నైజాం, రెస్టాఫ్ భారత్ లో ఈ సినిమాను అమ్మిన నిర్మాతలు, ఆంధ్ర, సీడెడ్ లో ఓన్ గా అడ్వాన్స్ పద్ధతిలో రిలీజ్ చేసినట్టు చెప్పారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల అయ్యి థియేటర్లలో ఎంతో మంచి వసూళ్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదలై థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటి సమస్త నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటిటిలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది.
Advertisement
థియేటర్లో ఈ సినిమాని మిస్ అయినటువంటి ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమాను ఓటిటిలో చూడటం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా నవంబర్ 19వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
Read Also : Gaalodu Telugu Movie Review in Telugu : ‘గాలోడు’ రివ్యూ