Ads
IPL సీజన్ మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని జట్లకు సంబంధించిన క్రికెటర్లు వారి క్యాంపులకు చేరుకున్నారు. మార్చి 31వ తేదీన అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం.. అయితే క్రికెట్ ప్రసార హక్కులను రిలయన్స్ కు చెందిన వాయుకం దక్కించుకున్న విషయం అందరికీ తెలుసు. దీంతో రిలయన్స్ జియో క్రికెట్ అభిమానుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
also read: Sri Hari and Ram Charan: 15 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ గురించి శ్రీహరి చెప్పిన మాటలు నిజమయ్యాయి !
క్రికెట్ అభిమానుల కోసం ప్రతిరోజు 3 gb డేటా లిమిట్ తో రూ.999, రూ.399, రూ.219 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 999 తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులు 3 gb డేటా లభిస్తుంది. అంతేకాకుండా 241 విలువైన డేటా ఓచర్ లభిస్తుంది. దీని ద్వారా మీరు అదనపు డేటాని పొందవచ్చు. ఇక 399తో 28 రోజులు, 61 విలువైన డేటా ఓచర్, ఇక 219 తో 14 రోజులు రూపాయలు 25 వోచర్ లభిస్తుంది. ఈ ప్లాన్సే కాకుండా డేటా యాడాన్ ప్లాన్స్ కూడా విడుదల చేశారు.
Advertisement
also read: TSPSC paper leakage : రేణుక ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి!
మీరు తీసుకున్న ప్లాన్ లో డైలీ లిమిట్ అయిపోతే మీరు యాడన్ ప్యాక్ వాడుకోవచ్చు. రూ.222 ప్లాన్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 50gb డేటా ఉంటుంది.రూ.444 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో, దీనిలో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ.667 డేటా యాడన్ రీఛార్జ ప్లాన్ 90 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 150 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్స్ తో క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేసేయండి.