Advertisement
Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు : జగదాబిరాముడు, సకల గుణదాముడైన శ్రీరాముడి జన్మదినమైన ఛైత్ర శుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగను మార్చి 30న జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఊరూరా శ్రీరామనవమి రోజూ సీతారాముల కళ్యాణం జరిపించి.. పానకం, వడపప్పుతో పాటు అన్నదానం కూడా చేస్తుంటారు.
Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, in Telugu
రామనామం పరమ పవిత్రమైంది. నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్ని బయటికి వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అదేవిధంగా మ అనే అక్షరం ఉచ్ఛరిస్తే.. మన పెదవులు మూసుకుంటాయి. బయట మనకు కనిపించే పాపాలు లోనిక ప్రవేశించలేవు. అందుకే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామ నవమి రోజు బంధువులకు, స్నేహితులకు ఇలా తెలియజేయండి.
Also Read: Ugadi Panchngam and Ugadi Rashi Phalalu In Telugu 2023 నుంచి 2024
శ్రీరామ చంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కానీ ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే,
ప్రతి ఏడాది నిత్య నూతనమే,
Advertisement
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే.
ప్రతీ ఏటా మనమే దగ్గరుండి ఈ పెళ్లిని జరిపిస్తాం, మన ఇంట్లో పెళ్లి అని మురిసిపోతాం
ఈ పెళ్లి జరిగాకే మన ఇంట్లో పెళ్లిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ ప్రారంభిస్తాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం, ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు.
అన్నీకలిపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.
అదే రామాయణం అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ జయరామ జయ జయ రామ!
ఆపదా మన హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
Advertisement
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. బంధువులకు, కుటుంబ సభ్యులకు ఇలా చెప్పండి..!