Ads
గతంలో భర్తలను భార్యలు ఏవండీ, బావగారు, జీ, హాజీ అని పిలిచేవారు. పాశ్యత్య సాంస్కృతి కారణంగా, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని, భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట! భర్తలను, భార్యలు పేరు పెట్టి పిలవకూడదట. ఇలా చేయడం అమర్యాదకరమట, అంతేకాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట! ఆ మాటకొస్తే మనకన్నా పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవడమే తప్పు, అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను పేరు పెట్టి పిలవడం ముమ్మాటికీ తప్పే అంటున్నాయి మన సాంప్రదాయాలు.
READ ALSO : ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?
Advertisement
ఏకాంత సమయంలో భర్తను ఎలా పిలిచినా తప్పు లేనప్పటికీ ఇంట్లో వాళ్ల ముందు, పిల్లల ముందు, బయటి వాళ్ల ముందు మాత్రం పేరు పెట్టి పిలవకూడదట, ఇలా చేయడం వల్ల వారిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాక, మీ గౌరవము తగ్గుతుందట! గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు.
ఉదాహరణకు గౌతమి పుత్ర, జిజియా పుత్ర అని పిలిచేవారు. ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాధ్యం కాబట్టి ఏవండీ అనే అనురాగ మాధుర్యంతో, బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచిదట. ముందుగా ఓసారి భార్యభర్త కూర్చొని చర్చించిన తర్వాతే అలా పిలుచుకోవడం మొదలుపెట్టండి. అత్తమామలు తమ కొడుకుని పేరు పెట్టి పిలవడం ఇష్టపడరు. కోడలికి పొగరు అనుకుని అంచనాకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లను కూడా కన్విన్స్ చేశాకే భర్తలను పేరు పెట్టి పిలవండి.
READ ALSO : వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !