Advertisement
Husband And Wife: వైవాహిక జీవితం (happiness in martial life) బాగుండాలని భార్యాభర్తలు కలకాలం కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు, ఏ భార్య ఏ భర్త బంధం ముక్కలు అయిపోవాలని అనుకోరు. అయితే భార్య అనేక విషయాలపై కష్టపడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. కనీసం భర్త అయినా ఆమె సంతోషం గురించి ఆలోచించాలి. భార్య ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, పిల్లలకి ఏం కావాలి ఇలా అన్నీ కూడా చూసి చేసుకుంటూ ఉంటుంది. ఎంతగానో కష్టపడుతుంది. అటువంటి ఆమె కోసం భర్త ఏం కావాలి, ఎలా చూసుకోవాలి అనేది ఆలోచించాలి. ఆమె చిన్న ప్రపంచంలో ఉంటుంది ఆమెను సంతోషంగా భర్త చూసుకోవాలి.
Advertisement
పెళ్లి తర్వాత తల్లిదండ్రులని పుట్టిన ఊరుని అందర్నీ వదిలేసి వస్తుంది అటువంటి ఆమెని సంతోషంగా చూసుకునే బాధ్యత భర్తది. కనీసం భర్త అయినా ఆమె సంతోషం గురించి ఆలోచించాలి. ఆరోగ్యం బాగాకపోయినా ఎంత ఇబ్బందిగా ఉన్న ఇంట్లో వాళ్ల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది. ఆమెకి ఏం కావాలి..? చిన్నగా మీరు పొగిడిన ఎంతో సంతోషపడుతుంది. కూర వండినప్పుడు ఈరోజు కూర బాగుంది అంటే చాలు ఎంతో సంబరపడిపోతుంది. పడిన కష్టాన్ని అంతటినీ కూడా నిమిషంలో మర్చిపోతుంది. భర్త తెచ్చే మల్లెపూలతో మురిసిపోతుంది.
Advertisement
Also read:
- Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి అంతటి స్టార్ హీరో అయ్యారా ! కృష్ణ చేసిన త్యాగం ఏంటంటే..?
- Best husband qualities: భార్య భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవేనట ! 2వ ది చాలా ముఖ్యం..!
- Renu Desai : రేణు దేశాయి రెండో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?
ఎప్పుడో ఒకసారి తెచ్చే చీరని చూసి ఆమె తెగ సంబరపడిపోతుంది భర్త పొగడ్తలే ఆమెకి పౌర్ణమి వెలుగు. కొంచెం అప్పుడప్పుడు సహాయం చేయడం, ఆమెకి ధైర్యం ఇవ్వడం ఆమెకి తోడు గా ఉండడం చాలు. ఇక జీవితానికి ఇది చాలు అనుకుంటుంది. ఈ రోజుల్లో ఖర్చులు కారణంగా భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఇంట్లో పనుల కోసం నాలుగు గంటలు కి నిద్ర లేచి 9 గంటలకి ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చి మళ్లీ ఇంటి పనులు చేసుకుంటున్నారు ఒకపక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారు. ఆమె కోసం మీరు ఏమి చేయక్కర్లేదు కాస్త కేర్ తీసుకుంటే సరిపోతుంది ఆమె సంతోషంగా తన పనులని బాధ్యతలని నిర్వర్తిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!