• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » జనసేన సభలో హైపర్ ఆది పంచ్ లు!

జనసేన సభలో హైపర్ ఆది పంచ్ లు!

Published on January 12, 2023 by sasira

Advertisement

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి బహిరంగ సభలో సినీ నటుడు హైపర్ ఆది పంచులు, ప్రాసలతో చెలరేగిపోయాడు. అతని ప్రసంగం చేస్తుండగా.. వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. సభకు వచ్చిన వేలాది మంది జనం కూడా కాసేపు సరదాగా కేకలు పెట్టారు.

ఏపీ మంత్రులను వారి శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే.. పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ చురకలంటించాడు. వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు.. అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందేనని సెటైర్లు వేశాడు. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడని.. ఆయన ప్రేమకే లొంగుతాడు తప్ప.. ప్యాకేజీకి కాదన్నాడు.

Advertisement

ప్రజల సమస్యలు తీర్చడాన్ని పక్కనపెట్టి, ఏపీ మంత్రులు జనసేనానిని తిట్టడాన్నే పనిగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ఆది. పవన్ ను తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకుని, కంటిన్యూగా తిట్టండి అంటూ సెటైర్లు వేశాడు. లేకపోతే ఆయా శాఖలకు మంత్రులుగా ఉండి శాఖల పరువు తీస్తున్నారంటూ మండిపడ్డాడు. స్టేజీ మీద ఉన్న నాయకులు అందరి కంటే అతి తక్కువ ఆస్తులు ఉన్న నేత పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నాడు ఆది. ఎందుకంటే ఆయన డబ్బులు పెంచుకుంటే పోయే మనిషి కాదని, పంచుకుంటూ పోయే మనస్తత్వం కలవాడని తెలిపాడు.

Advertisement

డబ్బు మీద ఆశలేని వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే, ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు చేస్తాడడని.. అలాంటి పవన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం సరికాదన్నాడు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారని ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారని.. ఓడిపోతేనే ఇంతమంది ప్రజలకు సహాయం చేస్తున్నారంటే.. గెలిస్తే మీ కష్టాన్ని కాంపౌండ్ వాల్ కూడా దాటనివ్వరని చెప్పాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను విమర్శించి.. పాపులర్ అయిపోవాలనుకునేవారేనని మండిపడ్డాడు. ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నాడు ఆది.

Latest Posts

  • వివేకా హత్యకేసు.. సీబీఐ దూకుడుతో మిస్టరీ వీడేనా?
  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd