• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » సరిహద్దుల్లో.. చైనా కుతంత్రం..!

సరిహద్దుల్లో.. చైనా కుతంత్రం..!

Published on December 13, 2022 by sasira

Advertisement

భారత భూమిని ఆక్రమించేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉంది చైనా. సరిహద్దు ప్రాంతాల్లో చొచ్చుకొస్తూ రెచ్చగొడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. ఈ గొడవలో ఇరువైపులా కొంతమంది జవాన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘర్షణ అనంతరం శాంతిని నెలకొల్పేందుకు ఉన్న మెకానిజం ప్రకారం.. చైనీస్ కమాండర్ తో తవాంగ్ సెక్టార్ లోని ఇండియన్ ఆర్మీ కమాండర్ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపారు.

రెండేండ్ల క్రితం తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవ తర్వాత తరచూ సరిహద్దుల్లో రెచ్చగొడుతోంది చైనా. ఆరోజు గల్వాన్ గొడవలో మన జవాన్లు 20 మంది చనిపోయారు. చైనా మాత్రం మృతుల వివరాలు వెల్లడించకపోయినా.. 40 మందికిపైగా చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య మిలిటరీ కమాండర్ ల స్థాయిలో అనేక దఫాలుగా చర్చలు సాగాయి. మళ్లీ ఇన్నాళ్లకు అదే స్థాయిలో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. దౌత్యమార్గాల ద్వారా చైనా అధికారులతో చర్చించామన్నారు. ఘర్షణల్లో రెండు పక్షాల వారూ గాయపడ్డారు.. కానీ మన వైపున జవాన్లలో ఎవరూ మరణించడం లేదా తీవ్రంగా గాయపడడం జరగలేదని స్పష్టం చేశారు. భారత కమాండర్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో చైనా దళాలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు.

Advertisement

భారత భూ భాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులకు మన వాల్లు ధీటైన జవాబు ఇచ్చారని వెల్లడించారు రాజ్ నాథ్. వారు ధైర్యంగా అడ్డుకున్నారని తెలిపారు. భారత సరిహద్దులను కాపాడేందుకు బలగాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. అంతకుముందు లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. క్వశ్చన్ అవర్ జరగకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. తవాంగ్ ఘర్షణపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినా విపక్షాలు వినిపించుకోకపోవడం సరికాదన్నారు.

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd