• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » స్పీడ్ లో టీమిండియా.. జోష్ లో ఫ్యాన్స్

స్పీడ్ లో టీమిండియా.. జోష్ లో ఫ్యాన్స్

Published on January 21, 2023 by sasira

Advertisement

ఈమధ్య మనోళ్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సిరీస్ లు కైవసం చేసుకుంటున్నారు. ఈమధ్యే శ్రీలంకపై సిరీస్ సాధించగా.. తాజాగా న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో ఇప్పటికే రెండింటిలో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది.

భారత్, న్యూజిలాండ్ మధ్య రాయపూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ ఫెయిల్ కావడంతో 34.3 ఓవర్లకు కేవలం 108 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగాయిపోయారు. షమీ 3 వికెట్లు, పాండ్యా2, సుందర్ 2, ఠాకుర్ 1, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్ల భారీ విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ 51(50), శుభ్‌ మాన్ గిల్ 40(53) నాటౌట్, విరాట్ కోహ్లీ 11(9), కిషన్ 8(9) నాటౌట్ తో ఆకట్టుకున్నారు. భాతర్ మూడు వన్డేలో సిరీస్‌ ను 2-0 తో కైవసం చేసుకుంది.

Advertisement

ఇటు మ్యాచ్ మధ్యలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్‌ శర్మ సిక్సర్ బాదిన వెంటనే ఓ బాలుడు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకువచ్చాడు. హిట్‌ మ్యాన్‌ ను కౌగిలించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ బాలుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్తుండగా అతన్ని వదిలేయాలని రోహిత్ సిబ్బందికి సూచించాడు.

మరోవైపు ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌ లో భార‌త్ మూడో స్థానానికి ఎగ‌బాకింది. రెండో వ‌న్డేలో ఆల్‌ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్‌ పై 8 వికెట్ల తేడాతో గెలిచి ర్యాంకింగ్‌ ను మెరుగుప‌రుచుకుంది. వ‌రుస‌గా రెండు వ‌న్డేల్లో ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఆ జ‌ట్టు రెండో స్థానానికి ప‌డిపోయింది.

Advertisement

భార‌త సిరీస్‌ కు ముందు న్యూజిలాండ్ 115 రేటింగ్ పాయింట్ల‌తో మొదటి స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్ 113 రేటింగ్ పాయింట్ల‌తో రెండు, ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడు, భార‌త్ 111 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉండేవి. భార‌త్‌ తో వ‌న్డే సిరీస్‌ ఓట‌మితో కివీస్ రెండో స్థానానికి, ఇంగ్లాండ్ ఫస్ట్ ప్లేస్ కి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నాలుగు, పాకిస్థాన్ ఐదో ప్లేస్‌ లో నిలిచాయి. మూడో వ‌న్డేలో కివీస్‌ ను ఓడిస్తే భార‌త్‌ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరే అవ‌కాశం ఉందంటున్నారు నిపుణులు.

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd