Advertisement
ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతోంది. గురువారం నుంచి చెన్నై వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఆకాశ్ దీప్, యశ్ దయాల్ ఎంపికయ్యారు.
Advertisement
భారత్ తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా లేదంటే ముగ్గురు పెసర్లతో ఆడబోతోందా అనే దాని గురించి క్లారిటీ లేదు. చెన్నైలోనే చెపాక్ మైదానం స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ సిద్ధం చేసినట్లు వార్తలు అయితే వచ్చాయి.
Advertisement
Also read:
Also read:
అంతేకాకుండా వికెట్ పై కాస్త గ్రాస్ కూడా వదిలేసారని పేసర్లకు అనుకూలంగా రెడీ చేసినట్లు కొన్ని వెబ్సైట్స్ ద్వారా తెలుస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటారు. అక్షర పటేల్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!