Advertisement
Nani Dasara Movie: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దసరా మూవీ గురించి కనబడుతోంది.. న్యాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం రా అండ్ విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీగా అంచనాల నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో పాటల గురించి మాటల్లో చెప్పలేం..
Also Read:Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
రిలీజ్ అయిన పాటలు ఇప్పటికే హైపుని క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రానుంది. ఈ తరుణంలోనే మూవీ యూనిట్ అంతా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ హాజరైన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దసరా పోస్టర్ లో సిల్క్ స్మిత ఫోటో ఎందుకు పెట్టారని యాంకర్ ప్రశ్నించగా.. నా చిన్నతనంలో మా తాత కాళ్లు విరిగాయి. తాత కళ్ళు తీసుకురమ్మంటే వెళ్లాను..
Advertisement
అక్కడ కళ్ళు దుకాణంలో ఫస్ట్ టైం సిల్క్ స్మిత ఫోటో చూశాను. అప్పటినుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు ఆమెను చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఆమెలా నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలని, ఆమెకు ఫ్యాషన్ మూవీస్ అంటే పిచ్చి అని విన్నాను.. ఇక చిన్నప్పటినుంచి నా మెదడులో అలా ఉండిపోయింది.. అందుకే కళ్ళు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టానని అన్నారు. ఈ విధంగా క్లారిటీ ఇచ్చి మనసులో మాటలను బయటపెట్టారు శ్రీకాంత్ ఓదెల.
Advertisement
Also Read: Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!