Ads
కరీనగర్ జిల్లా కి చెందిన బాలుడిని దత్తత తీసుకునేందుకు ఇటలీ నుంచి ఇండియా కు వచ్చారు ఈ దంపతులు. కరీంనగర్ పట్టణంలో ఉన్న శిశు గృహలో ఉన్నటువంటి అనాథ బాలుడిని దత్తత తీసుకునేందుకు ఇటలీకి చెందిన వారు ముందుకొచ్చారు. పదేళ్ల వయస్సు ఉన్నటువంటి బాలుడిని స్పెషలైజ్డ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా వారికి అప్పగించారు జిల్లా అధికారులు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అనాథ బాలుడిని బాగా చూసుకోవాలని ఇటలీకి చెందిన దంపతులకు సూచించారు.
Advertisement
దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన దంపతులు బాలుడిని పర్యవేక్షణ బాధ్యతలు తామే చూసుకుంటామని ప్రతీ మూడు నెలలకొకసారి అతడి బాగోగులకు సంబంధించిన వివరాలను పంపిస్తామని ఇటలీకి చెందిన ఏజెన్సీ ప్రతినిధి ఈ సందర్భంగా కలెక్టర్ కి వివరించారు. ఇటలీ దంపతులు దత్తత తీసుకుంటున్నందుకు వారితో వెళ్లేందుకు సుముఖంగా ఉన్నావా అని సదరు బాలుడిని కలెక్టర్ ప్రశ్నించగా.. సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బాబును మంచిగా చూసుకోవాలని దంపతులకు సూచించారు కలెక్టర్. అదేవిధంగా తరచూ బాలుడితో మాట్లాడుతూ అతని యోగా క్షేమాలపై ఆరా తీయాలని మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణకి చెందిన కరీంనగర్ బాలుడిని ఇటాలీయన్స్ దత్తత తీసుకోవడం హర్షించదగిన విషయం అని పలువురు చర్చించుకుంటున్నారు.
Also Read :
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో యాప్