Advertisement
ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికులకు అండగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కదిలారు. రాజమండ్రిలో కంపెనీ ఎదుట కార్యకర్తలు, కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. మూడున్నరేళ్లుగా కార్మికులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. అయితే.. జక్కంపూడితో వచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా నిరసన తెలియజేశారు.
Advertisement
యాజమాన్యం.. కార్మిక నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు జక్కంపూడి. కార్మికులకు అన్యాయం జరుగుతోందని.. దీనిపై కలెక్టర్, లేబర్ డిపార్ట్ మెంట్ దృష్టికి గతంలో తీసుకెళ్లామని తెలిపారు. అయినా కూడా యాజమాన్యం సైడ్ నుంచి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. సొంత చట్టాలతో కంపెనీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
అసలు.. కార్మిక చట్టాలను గౌరవించడం లేదన్నారు రాజా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. గతంలో ఇదే విషయంపై హంగర్ స్ట్రైక్ కు కూర్చున్నప్పుడు.. లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులు, యాజమాన్యం చర్చించి కొన్ని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇప్పటివరకు అవి నెరవేరలేదని మండిపడ్డారు.
రోజులు గడుస్తున్నాయేగానీ.. కార్మికుల కష్టాలు తీరడం లేదని యాజమాన్యంపై ఒత్తిడి పెంచాలని నిరసనకు దిగామని చెప్పారు. కార్మికుల ప్రయోనాలను కాపాడేందుకే వచ్చామని తెలిపారు జక్కంపూడి రాజా.