• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » కేసీఆర్, కేఏ పాల్.. మధ్యలో గద్దర్!

కేసీఆర్, కేఏ పాల్.. మధ్యలో గద్దర్!

Published on January 22, 2023 by Idris

Ads

నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే అంశంపై ప్రజాగాయకుడు గద్దర్ మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే.. మొదట్నుంచి కేసీఆర్ అంటే పడదు అనేలా మాట్లాడిన ఆయన ఈమధ్యకాలంలో స్వరం మార్చారు. నూతన అసెంబ్లీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినప్పటి నుంచి ఆయన తీరులో మార్పు మొదలైందని అంటున్నారు విశ్లేషకులు.

సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయాలని కేసీఆర్‌ కి ఈమధ్య గద్దర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కేసీఆర్‌ ను.. అన్నా అంటూ సంబోధిస్తూ.. కొన్ని రోజులుగా ఆయన మాటలు చూస్తున్నానని, దేశంలో ప్రధాన సమస్యలపై కేసీఆర్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నానని బాంబ్ పేల్చారు. దేశంలో ప్రధాన సమస్య భూ సమస్యేనని.. దాన్ని కేసీఆర్ అడ్రస్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

అయితే.. గద్దర్ తీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు గద్దర్ రూ.150 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మునోగుడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చేశారని అన్నారు. పాలనపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా? అని ప్రశ్నించారు.

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు పాల్. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని ఎద్దేవ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు. లక్షల మంది వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారని.. 70 శాతం ప్రజలు తన పాలన కోరుకుంటున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.

Related posts:

బీజేపీకి ముందుంది అసలు సినిమా..! Mp Komatireddy Serious Comments on Pm Modiపోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..! మరో కుటుంబానికి కోమటిరెడ్డి సాయం PM Modi Warning to KCR govtకుటుంబ పాలన వద్దంటున్న మోడీ.. బీఆర్ఎస్ పరివార్ సెటైర్!

Advertisement

Latest Posts

  • హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
  • చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
  • భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
  • మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
  • గాయాలేమీ లేవా? భవ్యశ్రీ కేసులో పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd