• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ మూవీ కథ లీక్‌! అదే నిజమైతే బొమ్మ హిట్‌ అంతే!

కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ మూవీ కథ లీక్‌! అదే నిజమైతే బొమ్మ హిట్‌ అంతే!

Published on November 25, 2022 by Bunty Saikiran

Advertisement

ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. సోషియో ఫాంటసీ జోనర్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మల్లిడి వశిష్ట తిరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే కళ్యాణ్ రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా చేసుకుంటూ వెళుతున్నాడు. ఇలా ఇప్పుడు రాజేంద్ర అనే దర్శకుడితో ‘ఆమిగోస్’ అనే సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేసింది. ఆమిగోస్ అంటూ స్పానిష్ పదంతో టైటిల్ ప్లాన్ చేశారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే హీరో తనలా పోలి ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఒక యాప్ ని వినియోగిస్తాడంట.

Advertisement

అయితే అతనికి మరో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారిలో ఒక వ్యక్తికి 6 వేళ్ళు ఉంటాయి. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తి అట. అంటే అతని వల్ల మిగిలిన వాళ్ళ స్థానాలను అతను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే సినిమా బృందం చెప్తున్నట్లు నీలాంటి వ్యక్తి నీకు ఎదురైతే నీకు మరణం తప్పదు అని క్యాప్షన్ పెట్టారు. అలా చూసుకున్నా కూడా కథలో జరిగేది అదే అని అర్థమవుతుంది. అయితే ఈ స్టోరీ లైన్ ఇప్పటిది కాదు. ట్విట్టర్ లో డిసెంబర్ 31, 2021 లోనే ఈ స్టోరీ లైన్ లీక్ అయింది. అప్పటి నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు 2023, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నారమాట.

Kalyan Ram New Movie Story Leak pic.twitter.com/NqhFbFbTxp

— Sekhar Rambo (@RamboSekhar) November 7, 2022

READ ALSO : సెమీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..రోహిత్ ఔట్ !

Related posts:

kalyanram-wife-swathiకల్యాణ్‌ రామ్‌ భార్య బ్యాక్‌గ్రౌండ్‌ గురించి తెలుసా? ravitejaఆ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో రవితేజ..ఏంటో తెలుసా..? ‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు? jrntrమహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd