Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర అని పేర్కొన్నారు. విశాఖలో పవన్ నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి. పవన్ కళ్యాణ్ ని చూసి మోడీ మొహం చాటేసారు. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులున్నాయా..? అని అడిగారు కే.ఏ.పాల్. విభజన హామీల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని, దశావతారం పవన్ కళ్యాణ్ 10 పార్టీలు మార్చారు. పవన్ జనసేన పార్టీని ప్రజాశాంతిలో విలీనం చేయాలని.. ప్రజాశాంతి పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తాను అని పాల్ పేర్కొన్నారు.
Advertisement
వారాహి యాత్రకు వెళ్తే రూ.500 ఇస్తున్నారు. చంద్రబాబు యాత్రకు వెళ్తే రూ.1000 ఇస్తున్నారు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ పవన్ సభలకు జనాలు రావడం లేదు. చంద్రబాబు పులివెందుల వెళ్లి రూ.50కోట్ల ఖర్చు చేసి నేను పులిని అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు పులి కాదు.. పిల్లి.. కేసీఆర్ తరిమేస్తే భయపడి అమరావతి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కే.ఏ.పాల్ విమర్శించారు. మరోవైపు విశాఖపట్టణంలోని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబు పై ఆరోపణలు చేసిన కే.ఏ.పాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.