Advertisement
చాలామంది ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో గాలి నాణ్యతని పెంచుకోవాలంటే ఈ మొక్కల్ని పెంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో గాలి నాణ్యతని మెరుగుపరుచుకోవచ్చు. స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచడం చాలా మంచిది. ఈ మొక్క గాలిలోని ఆక్సిజన్ ని మార్చడానికి బాగా పనిచేస్తుంది. గాలిలో ఉండే మలినాలను కూడా పోగోడుతుంది. అలాగే ఇంట్లో మొక్కల్ని పెంచే వాళ్ళు స్పైడర్ ప్లాంట్ ని పెంచడం కూడా మంచిది. ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన గాలిలో మలినాలు పోతాయి. గాలి స్వచ్చంగా మారుతుంది. ఇల్లు అందంగా ఉంటుంది.
Advertisement
పీస్ లిల్లీ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది కూడా గాలిలో మలినాలని పోగొడుతుంది. ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే బోస్టన్ ఫెర్న్ మొక్క కూడా బాగుంటుంది ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. గాలికి తేమని అందించి చర్మం ఆరిపోకుండా చూస్తుంది. పోదోస్ మొక్కని కూడా ఇంట్లో పెంచొచ్చు ఈ మొక్క ఇంట్లో ఉంటే విష వాయువుల్ని తొలగించవచ్చు.
Advertisement
Also read:
అలాగే ఇంట్లో పెట్టడం వలన ఇల్లు అందంగా కనపడుతుంది. రబ్బర్ ప్లాంట్ ని కూడా ఇంట్లో పెంచొచ్చు. స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించేందుకు రబ్బర్ ప్లాంట్ బాగా ఉపయోగపడుతుంది. తక్కువ సూర్యరశ్మిలో కూడా ఇది పెరుగుతుంది. గాలిలో ఉండే విషవాయువుల్ని తొలగించడానికి డ్రసియానా బాగా ఉపయోగపడుతుంది కుండీల్లో కానీ నేరుగా నేలపై కానీ పెంచొచ్చు. చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది కూడా తక్కువ సూర్యరశ్మి, నీళ్లు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. బాంబు ప్లాంట్ ని కూడా ఇంట్లో పెంచొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!