Ads
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2014కి ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. నిర్మాణాలు చేసుకున్న వారు ఆగస్టు 01 నుంచి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Advertisement
మరోవైపు దరఖాస్తులు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ శాఖ మూడు నెలలు పాటు సమయం ఇచ్చింది. 125 గజాల లోపు ఉన్న నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. 125 గజాల నుంచి 3 వేల వరకు ఉన్న వాటికి ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం.. స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది.