Advertisement
ఏ క్రికెటర్ కెరీర్ లో అయినా ఒడిదుడుకులు అనేవి సహజంగా ఉంటాయి. పొగడ్తలు వెల్లువలా ముంచెత్తినా.. ఒక్కోసారి విమర్శలు కూడా తప్పవు. జేజేలు పలికిన వారే తిట్టి పోస్తూ ఉంటారు కూడా. ఎంతటి స్టార్ క్రికెటర్లకు అయినా ఇది తప్పనిసరి పరిస్థితే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు కూడా ఇలాంటి పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాటుకుని వచ్చిన వారే. ఎవరి కెరీర్ లో అయినా ఈ ఫామ్ అనేది మారుతూనే ఉంటుంది. స్టార్ ప్లేయర్స్ కూడా ఒకప్పుడు ఎదురు దెబ్బలు తిని ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం రాహుల్ కూడా ఇదే స్టేజి లో ఉన్నారు. గాయం కారణంగా రాహుల్ ఆట తీరులో కొంత మార్పు వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో రాహుల్ విఫలం అయ్యారు. ఆ గాయం కారణంగా అతని కెరీర్ ప్రశ్నార్ధకం కాగా.. ఇప్పుడు తిరిగి వేగం పుంజుకుంటున్నాడు. ఇక రాహుల్ అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నది రాహుల్ 2.0 వర్షన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Advertisement
రాహుల్ కు ఐపీఎల్ 2023లో గాయం అయిన సంగతి తెలిసిందే. తిరిగి ఆడగలడా? లేదా అని అంతా అనుకున్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో ఇండియాకు చెప్పుకోదగ్గ స్కోర్ ని సంపాదించి పెట్టాడు. మొదటి రోజే టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా చతికిలపడి పెవిలియన్ చేరిన సమయంలో కె ఎల్ రాహుల్ నిలబడ్డాడు. టెయిలెండర్స్ ను అడ్డు పెట్టుకుని ఆటని ముందుకు సాగించాడు. 150 పరుగులలోపే ఆల్ అవుట్ అవుతుంది అనుకునే సమయంలో రాహుల్ వచ్చి 245 పరుగులు చేసే స్థాయికి తీసుకొచ్చాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు కొట్టి.. 4 సిక్సర్లతో మొత్తంగా 101 పరుగులు చేశాడు. మొత్తానికి టీం ఇండియాకు మంచి స్టార్టర్ ని అందించాడు.
Read More:
Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్…!
Prabhas Movies: ఇంకో 4 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమాల నుండి రిటైర్ అయ్యిపోతారా..?
Prabhas Food Habits: ఒక్క రోజు ఆహారానికి.. ప్రభాస్ ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?