• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » అకాల వడగళ్లు.. రైతన్నకు కడగళ్లు.. ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్షకు దిగుతా..!

అకాల వడగళ్లు.. రైతన్నకు కడగళ్లు.. ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్షకు దిగుతా..!

Published on March 19, 2023 by sasira

Advertisement

తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టుగా రైతన్న పరిస్థితి మారిపోయిందన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అకాల వర్షం అన్నదాతల ఆశల్ని చిదిమేస్తే.. ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందని చెప్పారు. రాత్రనక పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టిందని.. తమ రక్తాన్ని చిందించి పంట పండించిన రైతన్న పరిస్థితి ఇప్పుడు ఆగమయిందన్నారు. దేశానికి వెన్నెముకైన అన్నదాత వెన్నె విరిగి సతమతం అవుతుంటే.. పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

rain in nagonda

అకాల వర్షం వల్ల భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిరప, టమాటో, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. వరి పంట అయితే.. గింజ కూడా లేకుండా రాలిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట, కనగల్, తుంగతుర్తి, నూతన్ కల్ సహా పలు మండలాల్లో చేతికొచ్చిన పంటలు నాశనం అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల బాధను కేసీఆర్ కు లేఖ రూపంలో వివరించారు కోమటిరెడ్డి.

Advertisement

‘‘ఇంకొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అయినా కూడా, ఎమ్మెల్యేలు గానీ, అధికారులు గానీ రైతన్నను పట్టించుకున్న పాపానపోలేదు. కనీస స్పందన కూడా కరువైంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వడగండ్లు పడ్డ ప్రాంతాల్లో నాయకులు, సంబంధిత అధికారులు పర్యటించి.. రైతుల నుంచి వివరాలు సేకరించి నష్టం అంచనా వేయాలి. ఎకరాకు 50వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఈ కష్టకాలంలో అన్నదాతలకు భరోసాని ఇవ్వాల్సింది పోయి కొందరు నేతలు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు కొన్ని చోట్లకు వెళ్లి మమ అనిపిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల రైతుల పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నించారు.

Advertisement

రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి. ఈనెల 22న తిరుమలగిరి మండలంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిరహారదీక్షకు కూర్చుంటానని తెలిపారు. అకాల వర్షానికి నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందాలని.. అప్పటివరకు తన పోరాటం ఆగదన్నారు. పంటలు దెబ్బతిన్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను, అధికారులకు చెప్పి రైతుల నుంచి వివరాలు సేకరించి, నష్టపరిహారం అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు.

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd