• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కేంద్రమంత్రి వైష్ణవ్ తో కోమటిరెడ్డి భేటీ

కేంద్రమంత్రి వైష్ణవ్ తో కోమటిరెడ్డి భేటీ

Published on April 20, 2023 by sasira

Advertisement

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ఢిల్లీలో భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ.. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపు అంశంపై వినతిపత్రం అందజేశారు. కోమటిరెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించారు అశ్విని వైష్ణవ్.

KomatiReddy met Union Minister Ashwini Vaishnav

భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్రమంత్రికి వివరించారు కోమటిరెడ్డి. భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని.. యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిందని.. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారని.. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్‌ కు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు.

Advertisement

ఇక జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడిందని.. అక్కడి నుంచి కూడా హైదరాబాద్ కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారని కేంద్రమంత్రికి వివరించారు కోమటిరెడ్డి. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలని అశ్విని వైష్ణవ్ ను కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మరోవైపు ఎంఎంటీఎస్‌ ను ఘట్‌‌ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎటీఎస్‌ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదని.. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.

Advertisement

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారు.

Related posts:

రోడ్డెక్కిన టీచర్లు.. సర్కార్ పై రాములమ్మ సెటైర్లు..! మరోసారి ముందస్తు ముచ్చట్లు..! ముందస్తు ఎన్నికలపై కోమటిరెడ్డి రియాక్షన్ ఇదే..! KTR Press Meet On TSPSC Paper Leakసోయి ఉందా.. ప్రతీ దానికీ నేనేనా?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd