• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. కలెక్టర్ కు కోమటిరెడ్డి ఫోన్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. కలెక్టర్ కు కోమటిరెడ్డి ఫోన్

Published on April 23, 2023 by sasira

Advertisement

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా పటేల్ గూడెం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

Komati Reddy visited PatelGudem

స్థానిక అంబేద్కర్ సంఘాన్ని అభినందిస్తున్నానని చెప్పిన కోమటిరెడ్డి.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, 30 ఏళ్లుగా తన వెంటే ఉన్న ఉపేందర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విగ్రహా ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. తాను కూడా మీ మనిషినే.. ఎల్లప్పుడూ తన సహకారం ప్రజలకు ఉంటుందని తెలిపారు. అందరి సహకారంతో స్థానికంగా రోడ్లు బాగు చేసుకున్నామని.. పటేల్ గూడెం నుంచి శ్రీనివాసపురం వరకు బీటీ రోడ్డు వేసుకున్నామని అన్నారు.

Advertisement

Komati Reddy visited PatelGudem 1

తరచూ ప్రధానమంత్రిని, కేంద్రమంత్రిని కలిసి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నానని అన్నారు కోమటిరెడ్డి. జీడికల్ కు కేటాయించిన 60 కోట్లు కాకుండా.. రోడ్ల అభివృద్ధి కోసం పటేల్ గూడెం పరిసరాల్లోనే వంద కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

Advertisement

అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత.. స్థానికంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొనుగోలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో జాప్యం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆయనకు వివరించారు. వెంటనే, కలెక్టర్ కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ఎంపీ చెప్పడంతో.. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

Related posts:

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ? మరో పంచాయితీ! ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ telangana bjp leaders meets amit shahబీజేపీ నేతలకు అమిత్ షా ఏం చెప్పారు? MP Bandi Sanjay Shocking Comments on CP Ranganathదూకుడుగా లీకేజ్ ఇన్వెస్టిగేషన్.. బయటకొచ్చిన బండి..!

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd