Advertisement
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బిజెపి, కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే నిన్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అయితే ఈ సభలో అమిత్ షా ప్రసంగంపై మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు. ఏ చిన్న అవకాశం దొరికిన కేంద్రం నుండి బీజేపీపై విరుచుకు పడే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, ఆదివారం జరిగిన సభ బిజెపిని, బండి సంజయ్ ను టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది.
అమిత్ షా కు చెప్పులు మోసిన బండి సంజయ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని టార్గెట్ చేసిన తెలంగాణ ఐటి శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతి గులాములను-ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడిని-తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ పాలకులకు గుజరాతి నాయకులకు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నాడని తెలంగాణలో అటువంటి నాయకత్వం ఉందని బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Advertisement
అంతేకాదు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉన్నది అంటూ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న బిజెపిని తరిమి కొడతారు అంటూ బిజెపి పై నిప్పులు చెరిగారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అని సంబోధించడం ఈ శతాబ్దపు జోక్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్ ఆలోచనలో ఉన్న రైతుబంధుని కాపీ చేసి పీఎం కిసాన్ గా పేరు మార్చింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఎదుర్కొన్న తర్వాత దేశంలోని రైతులకు ఎవరు క్షమాపణలు చెప్పారో చెప్పాలని, 700 మంది రైతుల విలువైన ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత రైతులను మన్నించమని అడిగింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
The Farmer friendly Modi Govt
Is this the Jungle Raj that you to bring to Telangana @AmitShah Ji? pic.twitter.com/KpwkeFevkN
— KTR (@KTRTRS) August 22, 2022
Comment – As we have said multiple times before, BJP is the worst manifestation of congress.
Be it nepotism, corporate corruption, subservience..
How is this any different from Rajeev Gandhi – Anjiah episode?
Disgusting to say the least. Have some spine… pic.twitter.com/PP82PJynw6
— Telugu360 (@Telugu360) August 22, 2022
Advertisement