Advertisement
ఫ్యాన్స్ ను అలరించడానికి మన హీరోలు ఎప్పుడూ కొత్తదనం కోసం పాకులాడుతారు. విభిన్న తరహా పాత్రల ద్వారా మెప్పించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాత్రలో లేడీ గెటప్ ఒకటి. దీన్ని చేయడానికి చాలా ధైర్యం కావాలని చెబుతారు. గెటప్ వేయడంతోనే సరిపోదు అమ్మాయిల్లా హావాభావాలు, హోయలు ఒలికించడం కష్టతరమైన పని. మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్రశ్రేణి కథానాయకులు కూడా అమ్మాయిల వేషాలు వేసి అలరించారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడ గెటప్ వేసి మెప్పించిన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా…
READ ALSO : సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తినకూడదా ? అసలు మంచిది కాదా….?
ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు సైతం ఎన్నో సార్లు ఆడపిల్లల పాత్రలు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇందులో కమలహాసన్ భామనే సత్యభామనే సినిమా కోసం, రాజేంద్రప్రసాద్ మేడం సినిమా కోసం ఆడపిల్లల గెటప్ వేశారు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఆడవేషం వేయకతప్పలేదు. ఇక లేడి గెటప్ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమలహాసన్. తెలుగు మరియు తమిళంలో 27 ఏళ్ల క్రితం నటించిన భామనే సత్యభామనే సినిమా కోసం లేడీ గెటప్ వేసి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.
Advertisement
సినిమా మొత్తం చూసాక ఈ పాత్ర వేసింది కమలహాసన్ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏ కోణంలో చూసినా కమలహాసన్ అనే ఫీల్ కల్పించలేదు అంటూ నోరెళ్ళ పెట్టారు. అంతేకాకుండా తన అందంతో అందరినీ మైమరపించిన మరో హీరో గోవిందా.
పాతిక సంవత్సరాల క్రితం ఆంటీ నెంబర్ 1 అనే చిత్రంలో ఫుల్ లెన్త్ లేడీ రోల్ చేసిన గోవిందా అద్భుతంగా నటించడం మాత్రమే కాకుండా తన గెటప్ కూడా అదిరిపోయింది. ఈ విధంగా ఈ ఇద్దరు నటులు లేడీ గెటప్స్ లో చేయడంతో వారిని వారి అభిమానులు కూడా గుర్తుపట్టలేకపోయారు.
Advertisement
READ ALSO : Allari Naresh Ugram Movie Review in Telugu: అల్లరి నరేష్ “ఉగ్రం” ఫస్ట్ రివ్యూ