Advertisement
సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ.. సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అలా సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం..
Advertisement
Read also: మన అభిమాన నటులు ఒకప్పుడు ఎలా ఉండేవారో తెలుసా..!
1) మహేష్ బాబు: ప్రిన్స్ మహేష్ బాబుకి పేరుకి తగ్గట్లే జూబ్లీహిల్స్ లో అతిపెద్ద భవనం ఉంది. కానీ మహేష్ బాబు జువేనిస్టిక్ కాలనీలో ఉన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. మహేష్ బాబు అద్దెకి ఉంటున్న ఎదురింటిలోనే ఆమె సోదరీ కూడా ఉంటున్నారు.
Advertisement
2) నాగచైతన్య: ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఓ సాదాసీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. తన రెండవ సినిమా నుంచి ఈ ఇంటిలోనే మకాం వేశాడు. పెళ్లయిన తర్వాత సమంతతో కూడా ఈ ఇంటిలోనే కలిసి ఉన్నాడు. అందుకు గల కారణం తన తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ తోనే నాగచైతన్య ఆ ఇంటిని వదలడం లేదట.
3) పవన్ కళ్యాణ్: ఇక పవర్ స్టార్ కి కూడా నందగిరి హిల్స్ లో లంకంత భవనం ఉంది. కొంతకాలం పాటు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ మట్టి మీద ఉన్న మమకారంతో ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం అమరావతిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్నాడు.
4) రాజమౌళి: పెళ్లయిన మొదటి నుండి జక్కన్న మణికొండ లోనే ఉంటున్నాడు. అంతకుముందు రాజమౌళి ఓ విల్లా లో ఉండేవారు కానీ ఆ తర్వాత దాన్ని అద్దెకి ఇచ్చి మణికొండలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నారు.
5) జగపతిబాబు: అపోలో దగ్గర జగపతిబాబుకి భారీ బంగ్లా ఉంది. అయినప్పటికీ దాన్ని కాదనుకొని కూకట్పల్లిలోని రోట టవర్స్ లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నారు.
Read also: ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!