Ads
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ పజిల్, సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. విక్రమ్ సక్సెస్ తో డైరెక్టర్ లోకేష్ ట్విట్టర్లో ఆడియన్స్ తో మాట్లాడారు. ఈ మేరకు ఖైదీ టు చిత్రంపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు దర్శకుడు లోకేష్.
Advertisement
లోకేష్ కనగరాజ్.. ఖైదీ టు తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అర్జున్ దాస్ మరణించిన తర్వాత అతని పాత్ర ఎలా జీవించింది అని ఒక నెటిజన్ ప్రశ్నించగా… ఖైదీ లో నెపోలియన్ మాత్రమే దవడ విరగ్గొట్టాడు.. విక్రమ్ లో అందుకే కుట్టు గుర్తు ఉందని తెలిపారు.
అంతేకాక ఖైదీ టూ లో మరింత వివరించబడుతుంది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు లోకేష్. దర్శకుడు అధికారిక ప్రకటన విన్న కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న లోకేశ్ సీక్వల్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం చెప్పలేదు.