Advertisement
భోళాశంకరుడు, భక్త సులభుడు అయిన శంకరుడు తన భక్తులందరిని కాచుకుంటూనే ఉంటాడు. ఇక ఆయనకు ఎంతో ప్రియమైన కార్తీక మాసంలో ఆయన తన ప్రియా భక్తులను అనుగ్రహిస్తాడు. కోరిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు ఓ దీపం పెట్టి, ఒక పాత్ర నిండా నీతితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడు. అభిషేక ప్రియుడు అయిన శివుడికి మారేడు పత్రాలు అంటే కూడా ప్రీతి. ఆయన ఈ మాసంలో ఏ ఏ రాశుల వారిని ఎలా అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం.
Advertisement
మేష రాశి
వీరికి అధిపతి అంగారకుడు. అందుకే శివుడు వీరికి ప్రత్యేక దీవెనలు ఇస్తారట. అంగారక గ్రహాన్ని కూడా చాలా మంది శివుడిలో భాగంగానే పూజిస్తూ ఉంటారు. అంధకాసురుడితో శివుడు యుద్ధం చేస్తున్న సమయంలో శివుని శరీరం నుంచి చెమట చుక్క నేలని తాకింది. ఆ చుక్కే అంగారకుడిగా ఉద్భవించిందని చెబుతుంటారు. అందువల్ల వీరు పరమశివుడిని నిత్యం ప్రార్ధిస్తూ ఉంటె అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అధిపతి కుజుడు. వీరిపై కూడా పరమేశ్వరుని చల్లని కృప ఉంటుంది. నిత్యం ఆలయాలలో అభిషేకం చేయండి. అది మీ ఆర్ధిక మార్గాలకు దారి చూపుతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా విజయం లభించడానికి కారణం అవుతుంది. అనుకోని విధంగా మీకు ధనలాభం కలుగుతుంది.
Advertisement
మకర రాశి
మకర రాశి వారికి శనిదేవుడు అధిపతి. శివునికి ప్రీతికరమైన భక్తులలో శనిదేవుడు ఒకరు. అందుకే మకర రాశివారికి మహాదేవుని నుంచి ప్రత్యేక లాభాలు కలుగుతాయి. వీరు బిల్వ పత్రం, గంగాజలం, ఆవుపాలు వంటి వాటితో శివుడిని పూజిస్తే ఆ మహాదేవుడు మిమ్మల్ని ఏ కష్టం రానీయకుండా కాపాడతాడు.
కుంభ రాశి
వీరికి కూడా శనిదేవుడే అధిపతిగా ఉన్నాడు. వృత్తిపరంగా మీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. సంపదలతో పాటు మీ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. మీ లక్ష్యాన్ని సాధించడంలో ముందుంటారు. వీరు ఏ పని తలపెట్టినా కచ్చితంగా పూర్తి చేస్తారు.
Read More:
ఈ ఆటగాళ్లు తమ చివరి వరల్డ్ కప్ ఆడేశారా? నెక్స్ట్ వరల్డ్ కప్ కి వీరు ఉండట్లేదా?