• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » పోలవరం ప్రారంభం.. ఎప్పుడంటే..?

పోలవరం ప్రారంభం.. ఎప్పుడంటే..?

Published on March 5, 2023 by sasira

Advertisement

పోలవరం ప్రాజెక్ట్… ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. ఉమ్మడి విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన దీన్ని.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. మొదట్లో.. రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని.. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు.

2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పటికి పూర్తవుతుందో అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ హయాంలోనే కంప్లీట్ చేస్తామని ఇప్పటిదాకా పాలించిన ప్రభుత్వాలు చెప్పడమే గానీ కార్యరూపం దాల్చింది లేదు. పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. కచ్చితంగా తమ హయాంలో పోలవరం ఓపెనింగ్ జరిగి తీరుతుందని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు.

Advertisement

తాజాగా పోలవరాన్ని సందర్శించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్‌ లైన్‌ లు ఎందుకని ప్రశ్నించారు. వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్ట్‌ పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతతో ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. వైఎస్ కలలు కన్న ప్రాజెక్టు పోలవరం అని.. దీనిని సీఎం జగన్ చేతుల మీదుగానే ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

వరదల కారణంగా డయాఫ్రం వాల్ మీదుగా నీరు ప్రవహించిందని అన్నారు రాంబాబు. అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అవగాహన లేకనో, తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనో కాపర్ డ్యామ్‌ లను పూర్తి చేయకుండా డయాఫ్రం వేయటం వలన నష్టం ఏర్పడిందని తెలిపారు. దీనివల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరమని చెప్పారు. అలాగే, డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్‌ చేయడం కోసం రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారని చెప్పారు రాంబాబు.

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd