• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఈడీ విచారణకు కవిత.. 144 సెక్షన్!

ఈడీ విచారణకు కవిత.. 144 సెక్షన్!

Published on March 11, 2023 by sasira

Advertisement

సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టుకుంటోంది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు కవిత. ఆమె భర్త అనిల్, అడ్వకేట్లను లోపలికి అనుమతివ్వలేదు. వారిని బయటే నిలిపివేశారు పోలీసులు. దీంతో పిడికిలి బిగించి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఒక్కరే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు.

భారీ ర్యాలీగా ఈడీ ఆఫీస్ కు వెళ్లాలని కవిత చూడగా పోలీసులు అనుమతివ్వలేదు. ఆమె కారుతో పాటు మరో కారుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కవిత విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి.. భారీగా బలగాలను మోహరించారు.

Advertisement

మరోవైపు విచారణలో కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 9 మందిని కలిపి ఒకేసారి ప్రశ్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అరవింద్, దినేష్ అరోరా, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్‌ లను కలిపి ఈడీ విచారించినున్నట్లు సమాచారం.

Advertisement

సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవితపై ఈడీ కీలక అభియోగాలు మోపింది. సౌత్ లాబీపైన పలు విషయాలను ప్రస్తావించింది. ఈ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రు, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. సిసోడియా తరఫున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ.. ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని వివరించింది. హైదరాబాద్ కేంద్రంగా పలు కీలక సమావేశాలు జరిగాయని తెలిపింది ఈడీ.

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd