Advertisement
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురు చూశారు. అయితే హీరో మోక్షజ్ఞ ఎంట్రీ అఫీషియల్ అయింది అని అందరికీ తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమాను ప్రారంభిస్తున్నారు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ వర్మ తో పాటుగా నిర్మాణంలో భాగస్వామిగా బాలకృష్ణ చిన్న కూతురు భాగస్వామ్యం అవుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో బాలకృష్ణ కృష్ణుడు పాత్రలో కనిపిస్తున్నారు. ఆ పాత్ర బాలయ్య బాబుకు మాత్రమే సూట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
Advertisement
అంతేకాక ఈ సినిమాకి మోక్షజ్ఞ తీసుకునే రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో నటించడానికి మోక్షజ్ఞ 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం. బాలకృష్ణ నటించిన సినిమాకి 10 నుండి 15 కోట్లు వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే బాలకృష్ణ కంటే డబల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం పెద్ద టాపిక్ గా మారింది.
Advertisement
Also read:
కేవలం మొదటి సినిమాతోనే ఇంత రేంజ్ ని అందుకుంటున్న నందమూరి మోక్షజ్ఞ, రాబోయే సినిమాల్లో ఏ రేంజ్ కి వెళ్తాడో చూడాలి. సరైన విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్ కు ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చిరంజీవి కొడుకు గా రామ్ చరణ్ రెండో చిత్రంతో స్టార్ హీరోగా అయ్యాడు మరియు అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్ కూడా చాలా హైప్ తో ఇండస్ట్రీలోకి మొదలుపెట్టారు కానీ
స్టార్స్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ కి ఎంతో అవకాశం ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!