• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి

రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి

Published on March 15, 2023 by sasira

Advertisement

రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని అన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు గురించి దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. పాయింట్ టు పాయింట్ అంతా డిస్కస్ చేశారు.

MP Komatireddy Venkat Reddy Meets NHAI chief Santosh Kumar Yadav Over RRR Issue

భేటీ అనంతరం మాట్లాడిన కోమటిరెడ్డి… రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించినట్టు చెప్పారు. భూ సేకరణ అవసరానికి మించి జరుగుతోందని.. దీనివల్ల ఎంతోమంది పేదలు, దళితులు నష్టపోతున్నారని తెలిపారు. జోరుగా ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్న విషయాన్ని సంతోష్ కుమార్ కు వివరించినట్టు చెప్పారు ఎంపీ. తరతరాల నుంచి వస్తున్న కొద్దిపాటి భూమిని కోల్పుతున్నవారు చాలామంది ఉన్నారని.. అవసరం లేకున్నా భూములు తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.

Advertisement

ప్రజల ఇబ్బందులను గుర్తించుకోవాలన్న కోమటిరెడ్డి.. ఇంకా డిజైన్ అప్రూవల్ కాలేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500 కోట్లు చెల్లించలేదని అన్నారు. గతంలో ఈ విషయంపై చర్చించేందుకు ఐదారు సార్లు చైర్మన్ ని కలిశానన్న ఆయన.. పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

రీజనల్ రింగ్ రోడ్డుకు ఎంత అవసరమో అంతే భూమిని తీసుకోవాలని.. అదికూడా పేదలకు అన్యాయం జరగకుండా ఉండేలా చూడాలన్నారు వెంకట్ రెడ్డి. ఈ విషయాలన్నీ చైర్మన్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన అన్నీ సావదానంగా విని సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ విషయంలో తనవంతు సహకారం అందిస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చినట్టు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd