• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » భూనిర్వాసితులకు తోడుగా కోమటిరెడ్డి

భూనిర్వాసితులకు తోడుగా కోమటిరెడ్డి

Published on December 24, 2022 by Idris

Ads

బస్వాపురం రిజర్వాయర్​ కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ యాదాద్రి జిల్లా బీఎన్​ తిమ్మాపురం వాసులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇండ్ల నష్టపరిహారం కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం ఇవ్వాలని అంటున్నారు. ఈక్రమంలోనే వారి ధర్నా 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వాసితులను కలిశారు.

గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్న ఎంపీ.. స్పాట్ లోనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పారు. భూనిర్వాసితులకు ధైర్యం చెప్పి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. కేసీఆర్ సర్కార్ పై సీరియస్ అయ్యారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారమెంత? బస్వాపూర్ నిర్వాసితుల పరిహారం ఎంతో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాము తెలంగాణ బిడ్డలం కాదా అని నిలదీశారు కోమటిరెడ్డి. వాస్తు సరిగ్గా లేదన్న కారణంగా రూ.650 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టుకున్న కేసీఆర్‌ కు బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేంందుకు రూ.350 కోట్లు లేవా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రలో బెదిరించైనా పనులు చేయించుకున్నామని.. కానీ, ఇప్పుడు ఏ పనులు జరగడం లేదని మండిపడ్డారు. బిడ్డ ఢిల్లీకి, కుమారుడు బెంగళూరుకు, కేసీఆర్ ఇంకెక్కడికో పోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు.

కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యేలు గుట్టలు కొనుక్కొని వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు కోమటిరెడ్డి. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇసుక దందా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రోడ్డు కోసం వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాత గ్రామాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్మయంత్రి ఇప్పటికైనా స్పందించి బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts:

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ జాబ్ మేళా, 20 వేల మందికి ఉద్యోగాలు యూట్యూబ్ క్లాస్ లు వింటూ MBBS సీటు కొట్టింది.. హారిక ఎలా సాధించిందో తెలుసా? ఖబడ్దార్ కేసీఆర్ telangana bjp leaders meets amit shahబీజేపీ నేతలకు అమిత్ షా ఏం చెప్పారు?

Advertisement

Latest Posts

  • మెగాస్టార్ చిరంజీవి పక్కన స్టెప్పులేసి.. ఆ తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన ఈ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
  • బన్నీ- శ్రీజ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయ్యిందని తెలుసా? ఒకవేళ వీరిద్దరూ చేసి ఉంటే..?
  • నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
  • కంటతడి పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ… పెళ్లయ్యాక మొదటిసారి తన తల్లికి రాసిన ఈ లేఖలో ఏముందంటే..?
  • కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd